సమంత ఫోటోల కోసం కేస్ పెట్టారు

Mon Dec 11 2017 21:27:44 GMT+0530 (IST)

ఆల్రెడీ గెదెలు కాచుకుంటున్న సమంతను చూసి చాలామంది గ్లామర్ లవ్వర్స్ కన్నీరు మున్నీరు అయ్యారు. చక్కగా మోడ్రన్ డ్రస్సులో తనదైన స్థాయిలో రచ్చ చేసి ఈ తమిళ సుందరాంగిని.. అలా అంట్లు కడుగుతూ.. మోటర్ లో డీజిల్ పోసే పోరీగా చూపిస్తారా అంటూ కొంతమంది స్టన్నయ్యారు. కాని ఇదంతా చూస్తున్న 'రంగస్థలం' సినిమా మేకర్లు మాత్రం అవాక్కయ్యారు. ఎందుకంటారా? పదండి చూద్దాం.నిజానికి మొన్న రిలీజైన ఒక రెండు ఫోటోలు.. నిన్న రిలీజైన మరో రెండు ఫోటోలు.. అసలు రంగస్థలం సినిమా మీద తెలుగు సినిమా ఆడియన్స్ కు ఉన్న ఒపీనియన్ మార్చేశాయి. రామ్ చరణ్ స్థాయి హీరో ఇలాంటి ఊరమాస్ విలేజ్ బాబు పాత్రలో కనిపించడం.. అలాగే సమంత వంటి స్టార్ హీరోయిన్ ఇటువంటి డీగ్లామ్ పల్లెటూరి పిల్ల పాత్రను చేయడం అందరినీ సంభ్రమాశ్చార్యాలకు గురిచేశాయి. కానీ ఈ ఫోటోలన్నీ ఎవరో కావాలనే రిలీజ్ చేసి.. ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు నిర్మాతలు.

ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో మైత్రి మూవీస్ సంస్థ మేనేజర్ ఇవి పైరేటెడ్ పిక్స్ అని.. ఎవరో కావాలనే లీక్ చేశారని.. తద్వారా తమ ప్రమోషన్ ప్లాన్్స అన్నింటికీ ఇబ్బందులు కలిగించారని.. వారెవరో కనిపెట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట.