ఆవేదనతో కూడిన పగ కనిపిస్తోందిలే

Thu Oct 12 2017 12:52:38 GMT+0530 (IST)

హీరోయిన్లు ఎంత అందంగా ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చేది ఒక మంచి పాత్ర చేసినప్పుడే. అందుకే చాలా వరకు నటీమణులు ఒక్కోసారి పాత్ర కోసం వారి గ్లామర్ ని కూడా పక్కన పెట్టేస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది సౌత్ స్టార్ హీరోయిన్లు అటువంటి పాత్రలను చాల తక్కువగానే చేశారని చెప్పాలి. అయితే వారికి చెయ్యాలని ఉన్నా కూడా అందుకు తగ్గట్టు పాత్ర రాకపోవడం కూడా ఒక కారణం.  కాని అలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అప్పుడు ఏ మాత్రం మిస్ చేసుకోకుండా దాన్ని వాడుకుంటారు.స్టార్ హీరోయిన్ సమంత కూడా రాజు గారి గది 2 సినిమాలోని పాత్ర ని ఆ విధంగానే ఒకే చేసింది. ఇప్పటివరకు అమ్మడు గ్లామర్ లో బాగానే కనిపించింది. కానీ మొదటి సారి చేస్తున్న హర్రర్ కథలో కాస్త గ్లామర్ పక్కనపెట్టేసింది. రీసెంట్ గా సినిమాలోని సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫొటోలో ఆవేదనతో కూడిన హావభావాలతో సమంత కనిపించింది. ఈ సినిమాలో అమృత అనే లాయర్ పాత్రలో ఆమె అలరించనుందట. మోహంలో ఏ మాత్రం నవ్వు లేదు. చూపు బాధను చూపిస్తోంది. అలాగే దాని వెనుక ఒక పగ కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. తీరని కోపం ఆమెను ఆవేదనకి గురి చేసిందా అనేలా సమంత కనిపిస్తోంది.

ముందుగా చిత్ర యూనిట్ చెప్పినట్టుగా సమంత సినిమాలో గుండెని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. నాగార్జున ప్రధానపాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్  తెరకెక్కించాడు. పివిపి సినిమా.. మ్యాట్నీ ఎంటర్టయిన్మెంట్ మరియు ఓక్ ఎంటర్టయిన్మెంట్ ఈ సినిమాను రూపొందించారు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కానుంది.