ఫోటో స్టొరీ: ఫుల్ స్టైలిష్ గా సమంతా

Thu Dec 06 2018 15:13:39 GMT+0530 (IST)

అందరూ హీరోయిన్లు వేరు సమంతా వేరు. పెళ్ళైతే హీరోయిన్ గా పనికిరారు అనే మైండ్ సెట్ ఉన్న సౌత్ లో పెళ్ళైన తర్వాత నటించి బ్లాక్ బస్టర్లు నమోదు చేసింది.  ఈ ట్రెండ్ ను ఇక మిగతా సౌత్ హీరోయిన్లు ఆదర్శంగా తీసుకుంటారానడంలో ఏమాత్రం అనుమానం లేదు.  ఇలాంటి రికార్డులతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. సినిమా నిర్మాణంలో కూడా ఎంటర్ అవుతానని ఈమధ్యే వెల్లడించింది.ఇదిలా ఉంటే అప్పుడప్పుడూ హాట్ అండ్ స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తుంది.  అక్కినేని ఫ్యాన్స్ కొందరు ఈ ఫోటో షూట్ లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు గానీ అలాంటివేవీ పట్టించుకోదు సామ్.  తన ప్రొఫెషన్ విషయం.. ఏ డ్రెస్ లు వేసుకోవలన్నది తన ఛాయిస్ అని.. ఇతరులు ఆమెను  ఈ విషయంలో ఎలా ఫోర్స్ చేస్తారని అంటుంది. తాజాగా సమంత ఒక ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  చాకొలేట్ కలర్ లూజ్ ప్యాంట్.. బ్లాక్ ఇన్నర్.. పైనేమో అలా కప్పుకున్న బ్లాక్ స్ట్రైప్స్  ఉన్న బ్లేజర్ తో ఒక సూపర్ మోడల్ లాగా కనిపించింది. తన ఎక్స్ ప్రెషన్.. ఆ యాటి ట్యూడ్ మాత్రం ఒక ఫ్యాషన్ దివా ను గుర్తు తెస్తోంది.  

ఇక సినిమాల విషయానికి వస్తే హబ్బీ నాగ చైతన్యతో కలిసి 'మజిలీ' అనే చిత్రంలో నటిస్తోంది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో ఇద్దరూ భార్యా భర్తలుగా నటిస్తుండడం విశేషం.