ఫోటో స్టొరీ: పబ్ లో చై-సామ్ హగ్-కిస్

Tue Sep 25 2018 13:52:39 GMT+0530 (IST)

టాలీవుడ్లో ఉన్న క్యూట్ స్టార్ కపుల్స్ లో చై-సామ్ జంట టాప్ లో ఉంటుంది. అటువైపు చైతు.. ఇటు వైపు సమంతా మల్టిపుల్ ప్రాజెక్టులలో ఒకే సారి పనిచేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకేనేమో ఈ అక్కినేని జంట అఖిల్ తో కలిసి వెకేషన్ కు వెళ్ళింది.  హాలిడే అంటే ఇక ఫుల్ ఫన్నే కదా.ఆ ఫన్ మూమెంట్స్  ఎంజాయ్ మెంట్ ను అభిమానులతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సామ్.  అందులో ఒక ఫోటోలో చైతు ను గట్టిగా హగ్ చేసుకొని ముద్దిచ్చింది. పబ్ లో అక్కినేని జంట కలిసి డ్యాన్స్ చేస్తూ రొటీన్ షూటింగ్ ల హంగామా నుండి కాసేపు బయటకు వచ్చి పర్సనల్ స్పేస్ ను ఫుల్ గా వాడుకున్నారన్నమాట.  ఈ ఫోటో కు 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని క్యాప్షన్ ఇచ్చింది.

మరో ఫోటోలో చైతు - అఖిల్ ఇద్దరూ తమ చేతులని పైకెత్తి డీజే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.  ఈ ఫోటోకు 'అఖిల్.. చైతు.. ఫ్యామిలీ స్టిక్ టుగెదర్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటికే సెప్టెంబర్ అక్కినేని మంత్ అని నాగార్జున చెప్పాడు.  రిలీజ్ లు.. ప్రమోషన్స్.. హాలిడేలు.. ఫోటోలు.. ఇవన్నీ చూస్తుంటే అక్కినేని వారి హంగామా మామూలుగా లేదు!