ఫోటో టాక్: సమంత కిల్లర్ లుక్

Wed Mar 20 2019 16:20:14 GMT+0530 (IST)

సోషల్ మీడియా అనేది సెలబ్రిటీల పాలిట బంగారు బాతుగా మారింది. ఇన్ స్టాగ్రమ్ - ట్విట్టర్ మాధ్యమాల్లోకి ప్రపంచం ఇంకి పోవడంతో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలకు సామాజిక మాధ్యమాల్నే ఆశ్రయిస్తున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ ని పలువురు కథానాయికలు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ వ్యాపారం నుంచి కాస్మొటిక్స్ - వస్త్ర వ్యాపారం వరకూ ప్రతిదానికి ఇక్కడ ప్రచారం లభిస్తోంది. సొమ్ములిచ్చుకో ప్రచారం చేయించుకో అనేంతగా సెలబ్రిటీలు దీపం ఉండగానే చక్క బెట్టేస్తున్నారు.ఇదివరకూ కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో సినీతారల సోషల్ మీడియా ప్రమోషన్ వెనక లోగుట్టుపై ఆసక్తికర కథనం వెలువడింది. లక్షల్లో అందుకుంటూ ట్వీట్ ప్రచారం చేస్తున్నారని సదరు స్టింగ్ ఆపరేషన్ రివీల్ చేసింది. ఆ సంగతి అటుంచితే సామాజిక మాధ్యమాల్లో ఒక్కో బ్రాండ్ ప్రచారానికి ట్వీట్ కి కాజల్ - తాప్సీ వంటి కథానాయికలు 2-3 లక్షల చొప్పున అందుకుంటున్నారన్న ప్రచారం సాగింది. అయితే ఈ తరహా ప్రచారంలో ఇప్పుడున్న తారల్లో ఎవరు ది బెస్ట్? అన్నదానికి అక్కినేని కోడలు సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సమంత నవతరం స్టార్లలో క్షణం తీరిక లేనంత బిజీ స్టార్. నిరంతరం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ లోనూ సమంత స్పీడ్ గానే ఉన్నారు. యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న తారగా తనకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ తనకు ఉపకరిస్తోంది. ఒక్కో ట్వీట్ కి సామ్ ఏకంగా 12-15 లక్షలు అందుకుంటున్నారని తెలుస్తోంది. నిరంతరం బ్రాండ్ పబ్లిసిటీతో ఆదాయ ఆర్జన చేస్తున్న తారగా సామ్ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియా ప్రచారంలో నెక్ట్స్ లెవల్ ఇది అన్న టాక్ వినిపిస్తోంది.