Begin typing your search above and press return to search.

కాజల్‌ అడిగిన ప్రశ్న ఇప్పుడు సమంత..!

By:  Tupaki Desk   |   18 Nov 2018 12:12 PM GMT
కాజల్‌ అడిగిన ప్రశ్న ఇప్పుడు సమంత..!
X
ఈమద్య కాలంలో బుల్లి తెరపై యాడ్స్‌ విపరీతంగా పెరిగి పోతున్నాయి. స్టార్స్‌ పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌ - టాలీవుడ్‌ - కోలీవుడ్‌ ఇలా అన్ని సినీ వర్గాల వారు - క్రీడా వర్గాల వారు కూడా బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని యాడ్స్‌ చాలా ఫన్నీగా ఉండి - అందరి దృష్టిని ఆకర్షిస్తూ - సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. అందులో ఒకటే మీ టూత్‌ పేస్ట్‌ లో ఉప్పు ఉందా. కోల్గెట్‌ వారి ఆ యాడ్‌ లో అంబాసిడర్స్‌ గా చేసిన త్రిష - కాజల్‌ - ప్రియాంక చోప్రా - కరీనా కపూర్‌ లు మీ టూత్‌ పేస్ట్‌ లో ఉప్పు ఉందా అంటూ ప్రశ్నించారు.

సౌత్‌ ఆడియన్స్‌ కాజల్‌ యాడ్‌ కు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారు. కాజల్‌ మీ టూత్‌ పేస్ట్‌ లో ఉప్పు ఉందా అనే యాడ్‌ పై సోషల్‌ మీడియాలో ఎన్ని మీమ్స్‌ వచ్చాయో - ఎన్ని సినిమాల్లో జోకులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ షోల్లో అదో పెద్ద జోక్‌ అయ్యింది. అలా కాజల్‌ కూడా ఆ యాడ్‌ తో ఫేమస్‌ అయ్యింది. ఇప్పుడు సమంత ప్రేక్షకులను మీ టూత్‌ పేస్ట్‌ లో ఉప్పు ఉందా అంటూ ప్రశ్నిస్తోంది.

కోల్గెట్‌ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆ సమంత ఎంపిక అయ్యింది. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడులో ఈమె యాడ్స్‌ ప్రసారం అవుతున్నాయి. అయితే సమంతకు రెగ్యులర్‌ గా డబ్‌ చెప్పే చిన్మయి ఈ యాడ్‌ లో డబ్‌ చెప్పక పోవడంతో కాస్త నాచురాలిటీ తగ్గినట్లుగా అనిపిస్తోంది. మొత్తానికి సమంత బుల్లి తెరపై ప్రతి రోజు ఉప్పు ఉందా ఉప్పు ఉందా అంటూ ప్రశ్నించబోతుంది. సమంతపై ఎంతగా మీమ్స్‌ వస్తాయో చూడాలి.