Begin typing your search above and press return to search.

ముందు మహానటి సమంతే.. కాని..

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:19 AM GMT
ముందు మహానటి సమంతే.. కాని..
X
బాలీవుడ్లో బయోపిక్ లు తెగ వచ్చేస్తున్నాయి కానీ టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంకా బయోపిక్ లు ఇంకా అంతగా ఊపందుకోలేదు. అలనాటి నటి సావిత్రి జీవిత గాథతో తెరకెక్కుతున్న మహానటి సినిమా మాత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భారీ బడ్జెట్ తోపాటు భారీ కాస్టింగ్ తో షూటింగ్ అవుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో ఆసక్తి ఎక్కువగానే ఉంది.

మహానటి మూవీలో టైటిల్ రోల్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్ర చేస్తోంది. అసలు టైటిల్ రోల్ కు కీర్తి సురేష్ కన్నా ముందు సమంతనే తీసుకోవాలని అనుకున్నారట. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్ ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయం బయటపెట్టింది. మహానటి టైటిల్ రోల్ చేయడానికి ముందుగా సమంత సైన్ కూడా చేసిందట. కాకుంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ రోల్ ఓ కొత్త హీరోయిన్ చేస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. దాంతో సమంత ప్లేసులోకి కీర్తి సురేష్ వచ్చి చేరింది. ఈ సినిమాకు సైన్ చేసేపాటికి కీర్తికి అంత పాపులారిటీ కూడా ఏమీ రాలేదని స్వప్నాదత్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే కీర్తి చేసిన ఇతర సినిమాలు రిలీజై ఆమె బాగా పేమస్ అయిపోయింది. డైరెక్టర్ అభిప్రాయంతో ఏకీభవించిన సమంత కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుని సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయడానికి ఓకే చెప్పింది.

సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. హీరోయిన్ జమున పాత్ర అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే చేస్తోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహానటి మూవీ తెలుగుతోపాటు తమిళం, మళయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది.