Begin typing your search above and press return to search.

సమంత విషయంలో డౌట్లేం లేవు బాబులూ

By:  Tupaki Desk   |   30 Aug 2015 2:07 PM GMT
సమంత విషయంలో డౌట్లేం లేవు బాబులూ
X
బ్రహ్మోత్సవం సినిమాలో సమంత హీరోయిన్ అనగానే మండిపోయారు మహేష్ బాబు అభిమానులు. 1 నేనొక్కడినే పోస్టర్ కు సంబంధించి వివాదాన్ని మహేష్ మరిచిపోయినా అతడి అభిమానులు మాత్రం మరిచిపోలేదు. సమంతను ‘బ్రహ్మోత్సవం’ నుంచి తప్పించాలంటూ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ పెట్టి మరీ ఉద్యమం నడిపారంటే వారి కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ పక్కా ప్రొఫెషనల్ అయిన మహేష్ బాబు సమంత విషయంలో రాజీ పడలేదు. సమంతను మార్చడానికేమీ ఒప్పుకోలేదు. ఐతే సినిమా ముహూర్తం దగ్గర పడుతున్న టైంలో కొన్ని రోజులుగా సమంత విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. ముందు రకుల్ ప్రీత్ ను తీసుకోవాలనుకున్న పాత్రకే సమంతను ఎంచుకున్నారని.. అప్పటికి రకుల్ దగ్గర డేట్లు లేక తిరస్కరించిందని.. ఇప్పడామె ఫ్రీ అవడంతో సమంతను తప్పించి రకుల్ నే ఎంచుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐతే యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం కాస్టింగ్ విషయంలో ఏ మార్పులూ లేవు. బ్రహ్మోత్సవంలో సమంత ఉందన్న విషయంలో ఏ అనుమానాలూ లేవు. ఆమె మహేష్ సరసన కనిపించబోతోంది. తనే లీడ్ హీరోయిన్. ఈ సినిమాలో కాజల్, ప్రణీత కూడా ఉన్న సంగతి తెలిసిందే. సమంత విషయంలో మహేష్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. సెప్టెంబరులో ఆమెతో కలిసి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాడు. ఇంకో వారం తర్వాత హైదరాబాద్ కు వస్తాడు. సెప్టెంబరు ద్వితీయార్ధంలో షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. పీవీపీ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.