బాలీవుడ్ భామల కంటే సమంతే బెస్టు

Wed May 16 2018 16:14:47 GMT+0530 (IST)

‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి పడుచుపిల్ల రామలక్ష్మీగా తన అందంతో- అభినయంతో అలరించింది సమంతా అక్కినేని. ఈ టాలీవుడ్ యువరాణి ఇప్పుడు బాలీవుడ్ భామలతో పోటీపడి కిరీటం గెలుచుకుంది. ఏ కిరీటం అబ్బా... అని తెగ ఆలోచించకండి. ఏడాది కాలంలో బాలీవుడ్- టాలీవుడ్ పరిశ్రమలకి చెందిన కొందరు స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అందులో బాలీవుడ్ భామలు అనుష్క శర్మ- సోనమ్ కపూర్- సాగరికా గట్కేలతో పాటు సౌత్ బ్యూటీ సమంత కూడా ఉంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడింది అనుష్క శర్మ. సోనమ్ కపూర్ ఈ మధ్యనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని పెళ్లాడిన సంగతి తెలిసిందే.  మన్మథుడు అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య అక్కినేనిని ప్రేమించి పెళ్లాడి... అక్కినేని వారి కోడలు అయ్యింది సమంతా. క్రికెటర్ జహీర్ ఖాన్ ని వివాహమాడింది చక్ దే హీరోయిన్ సాగరికా గట్కే. స్టార్ స్టేటస్ అనుభవించిన వీరి పెళ్లి సందడి మామూలుగా ఉంటుందా... ఖరీదైన చీరల్లో పెళ్లి కూతురు గెటప్ లో మెరిసిపోయారు. వీరిలో ఎవరు బాగున్నారు... అని పోలింగ్ నిర్వహించింది ఓ వెబ్ సైట్.

అందులో బాలీవుడ్ భామలకంటే అధికంగా... దాదాపు 40 శాతం ఓట్లు సాధించి సౌత్ సత్తా చాటింది సమంతా. విరుష్కకి 38 శాతం ఓట్లు పోల్ కాగా కపూర్ పిల్ల సోనమ్ కి 20 శాతం ఓట్లు దక్కాయి. జహీర్ వైఫ్ కి కేవలం 2 శాతమే ఓట్లు పడ్డాయి. మొత్తానికి ‘ఏ మాయ చేశావే’ అంటూ చైతూ మనసు దోచిన జెస్సీ...పెళ్లి కూతురి గెటప్ లో నెటిజనుల హృదయాలు కొల్లగొట్టింది.