Begin typing your search above and press return to search.

చెర్రీతో సమంత.. ఇప్పటికి ఫిక్సయిందా?

By:  Tupaki Desk   |   24 Jan 2017 11:36 AM GMT
చెర్రీతో సమంత.. ఇప్పటికి ఫిక్సయిందా?
X
స్టార్ హీరోతో స్టార్ హీరోయిన్.. సినిమాలకు ఎప్పుడూ క్రేజీ కాంబినేషన్. కొత్త హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తున్నా.. స్టార్ హీరోయిన్ లతో అయితే.. ఆ మజానే వేరు. రామ్ చరణ్ -సమంత కాంబినేషన్ చాలా ఏళ్ల నుంచే వినిపిస్తోంది కానీ.. ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. కానీ ఫిలింనగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. చెర్రీ-సామ్ లను ఏకం చేస్తున్నాడట దర్శకుడు సుకుమార్.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఎవడు కోసం కూడా సమంతను పరిశీలించారు. 2015లో వచ్చిన బ్రూస్ లీ కోసం కూడా సమంత పేరు వినిపించింది. అయితే.. ఈ సినిమాలను వేర్వేరు కారణాలతో సమంత వదులుకుంది. కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో సుకుమార్ చేయనున్న మూవీ కోసం సమంతను ఫైనలైజ్ చేశారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అనుపమా పరమేశ్వరన్ కు ఈ అవకాశం ఇచ్చినా.. తర్వాత తప్పించారనే న్యూస్ ఇంకా హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుండగానే.. ఈ అవకాశాన్ని సమంత చేతిలో పెట్టేశారనే న్యూస్ బయల్దేరేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా పరిశీలించినా.. చెర్రీ చేసిన గత రెండు సినిమాల్లోనూ ఆమే హీరోయిన్ కావడంతోనే.. సమంతకు ఓటేశాడట రామ్ చరణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/