Begin typing your search above and press return to search.

హ్యాండ్ లూమ్ మామ్స్ కు సామ్ ఇన్విటేషన్

By:  Tupaki Desk   |   23 July 2017 9:49 AM GMT
హ్యాండ్ లూమ్ మామ్స్ కు సామ్ ఇన్విటేషన్
X
టాలీవుడ్ బ్యూటీ సమంత.. సినిమాలతో మహా బిజీ. మరోవైపు బ్రాండ్ అండార్స్ మెంట్స్ కు సంబంధించిన పనులనూ చక్కబెట్టేస్తోంది. వీటన్నిటితో పాటు మరో రెండు నెలల్లో జరగనున్న తన పెళ్లి పనులనూ చూసుకోవాలి. ఇక ఈ భామకు ఛారిటీ పనులపై కూడా మక్కువ ఎక్కువే. ఇన్ని పనులు చేసేస్తూ కూడా.. చేనేత వస్త్రాలకు సంబంధించి.. తనను ప్రచారకర్తగా నియమించినందుకు.. ఆ బాధ్యతల విషయంలో కూడా ఏ మాత్రం లోటు రానివ్వడం లేదు.

Woven2017 అంటూ చేనేత వస్త్ర ప్రదర్శనకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించనున్న సంగతి ఇప్పటికే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో అందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు.. ప్రజల్లో హ్యాండ్ లూమ్స్ పై అవగాహన ప్లస్ మక్కువ పెంచేందుకు కొత్తగా ఓ కాంపిటీషన్ కూడా స్టార్ట్ చేసింది సమంత. ఈ కార్యక్రమంలో కామన్ పీపుల్ కూడా భాగం అయ్యే అవకాశం ఉంటుందన్న మాట. అయితే.. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునేవారు చేయాల్సినదల్లా సింపుల్ పనే. ఆయా వ్యక్తులు తమ అమ్మ చేనేత వస్త్రాలలో ఉన్న ఫోటోను పోస్ట్ చేయాలి. అలాగే #ReviveHandloom.. #Woven2017 అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది.

ఇందుకోసం తన తల్లి నినెట్టి ప్రభు ఫోటోను కూడా పోస్ట్ చేసింది సమంత. ఇలా పోస్ట్ చేసిన వారి నుంచి 5 బెస్ట్ లుక్స్ ను తనే స్వయంగా ఎంపిక చేస్తుందట. వీరు ఆగస్ట్ 7న జరగనున్న ఉవెన్2017 లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చెప్పింది శామ్.