Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సామ్ ఆత్మావ‌లోక‌నం

By:  Tupaki Desk   |   22 Sep 2019 4:46 AM GMT
ఫోటో  స్టోరీ: సామ్ ఆత్మావ‌లోక‌నం
X
ఈ పోటోలో స‌మంత మ‌న‌సులో ఏం ఉందో చెప్ప‌గ‌ల‌రా?.. చూసేందుకు ఆ ఛాయాచిత్రం ఎంత క‌ళాత్మ‌కంగా క‌నిపిస్తున్నా.. అందులో ఏదో తెలియ‌ని అంత‌ర్మ‌ధ‌నం క‌నిపిస్తోంది. అస‌లింత‌కీ ఏమిటి ఆ మ‌ధ‌నం అంత‌రార్థం? అంటే.. సామ్ ఇచ్చిన కొటేష‌న్ ని త‌ప్ప‌క‌ చ‌ద‌వాలి.

``జీవితంలో తీవ్ర గాయాల్ని ఆత్మావ‌లోక‌నం చేసుకుంటేనే .. నీ అంత‌ట నువ్వుగా నిన్ను నువ్వు గుర్తించ‌గ‌ల‌వు. అప్పుడే మ‌న‌శ్శాంతి అన్న‌ది మిగుల్తుంది!`` ఇంత డీప్ గా కొటేష‌న్ ఇవ్వ‌డం ఏమిటో గానీ.. ఏదో తెలియ‌ని గాయం త‌న‌ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని అర్థ‌మైంది. అది మ‌న‌సుకు సంబంధించిన గాయ‌మో.. ఏమో! సామ్ నే చెప్పాలి.

ఇటీవ‌లే ల‌క్ష్మీ టాక్ షోలో హ‌బ్బీ చైత‌న్య‌కు సంబంధించిన ప‌డ‌క‌గ‌ది ర‌హ‌స్యాల్ని బ‌హిరంగంగా చెప్పేసి అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ని ఇచ్చిన సామ్.. త‌న‌లోని అంత‌ర్మ‌థ‌నాన్ని చైతో షేర్ చేసుకుని ఉంటుంద‌నే భావించాలి. 2019లో మ‌జిలీ- ఓ బేబి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న స‌మంత కెరీర్ మ‌రో స్థాయికి వెళుతోంది. మునుముందు మ‌రింత‌ బెట‌ర్ ప్లానింగ్ తో దూసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో సామ్ ఉంద‌ట‌.