నటన - కుటుంబం...నా రెండు కళ్లు: సమంత

Thu Oct 19 2017 14:43:27 GMT+0530 (IST)

నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత రూత్ ప్రభు...అక్కినేని సమంతగా మారింది. తన ట్విట్టర్ ఖాతాలో కూడా సమంత తన పేరును అక్కినేని సమంతగా మార్చుకుంది. అక్కినేని వారి కోడలిగా తన బాధ్యత మరింత పెరిగిందని సమంత పలు సందర్భాల్లో చెప్పింది. ‘రాజుగారి గది-2’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ....అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని అమల గారు ఎంతో ఇండిపెండెంట్గా ఉంటారని సమంత చెప్పింది. అక్కినేని అనేది ఓ పవర్ ఫుల్ నేమ్ అని - అక్కినేని కుటుంబంలో తాను కూడా చేరిపోయానని తెలిపింది. అక్కినేని వారి కోడలిగా తన బాధ్యత రెట్టింపయిందని చెప్పింది. అక్కినేని కుటుంబంలో సభ్యురాలినయినందుకు తాను ఎంతో సంతోషపడుతున్నానని చెప్పింది. సినిమా కుటుంబం తనకు రెండు కళ్ల వంటివని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత చెప్పింది.పెళ్లయిన తర్వాత సమంత సినిమాలలో నటించదని కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత సమంత సినిమాలకు వీడ్కోలు పలుకుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై సమంత క్లారిటీ ఇచ్చింది. తనకు కుటుంబంతో పాటు సినిమాలు కూడా ముఖ్యమేనని చెప్పింది. అవి తనకు రెండు కళ్ల వంటివని దేనినీ తాను వదులుకోనని తెలిపింది. సినీ నేపథ్యం ఉన్న అక్కినేని కుటుంబం నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదని తనపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నంత కాలం తాను నటిస్తానని తనను నటించకుండా ఆపే శక్తి  ప్రేక్షకులకు మాత్రమే ఉందని చెప్పింది.  8 ఏళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ ను మొదలు పెట్టిన తాను ప్రస్తుతం నటిగా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని సమంత చెప్పింది. తనకు హీరోయిన్ గా కన్నా నటిగా గుర్తింపు లభించాలని భావిస్తున్నానని చెప్పింది. విభిన్న పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదింస్తానని చెప్పింది.