Begin typing your search above and press return to search.

U టర్న్ తో సామ్ కు అంత ముట్టింది!

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:44 AM GMT
U టర్న్ తో సామ్ కు అంత ముట్టింది!
X
సమంతా తాజా చిత్రం 'U టర్న్' ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్ నంబర్స్ తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు మెరుగవుతున్నాయి. ఫుల్ రన్ లో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో లీడ్ యాక్టర్ గా నటించిన సమంతా ఎంత రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసింది?

సమంతా ఒక సినిమాలో నటించేందుకు సాధారణంగా రూ. 1.25 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ ఈ సినిమాకు మాత్రం రెమ్యూనరేషన్ అలా తీసుకోలేదట. నామమాత్రపు అడ్వాన్సు తీసుకొని సినిమాలో నటించిందట. సినిమాకు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో తనకు పర్సెంటేజ్ మాట్లాడుకుందట. సినిమాకు రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని దాంతో సమంతాకు రూ. 3.8+ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ముట్టిందని సమాచారం. దీంతో 'U టర్న్' సినిమాకు సమంతా అందుకున్న మొత్తం తన కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ అయ్యింది.

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా సీరియస్ గా సాగే పాత్రలో నటించి సమంతా మరోసారి అందరినీ మెప్పించింది. వేరే స్టార్ అట్రాక్షన్ లేకపోయినా సమంత పేరుతో ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించగలిగింది. ఇక ఇదే బాటలో ఫ్యూచర్ లో కూడా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుందేమో వేచి చూడాలి.