Begin typing your search above and press return to search.

అక్షయ పాత్ర కోసం సమంత ఏమంటోందంటే..

By:  Tupaki Desk   |   22 Jun 2018 7:04 AM GMT
అక్షయ పాత్ర కోసం సమంత ఏమంటోందంటే..
X
కొంత మంది సినీ తారలు చేసే పనులు అందరిని ఎంతగానో ఆకర్షిస్తాయి. వారు చేసే దాన ధర్మాలు చాలా వరకు ఇతరులకు కూడా ప్రేరణ కలిగిస్తాయి. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఇతరులకు సహాయం చేయకుంటే ఎంత వరకు న్యాయం అనే మంచి గుణం అందరికి ఉండదు. సినీ తారల్లో అయితే చాలా తక్కువ. అలాంటి మంచి మనసున్న వారిలో హీరోయిన్ సమంత ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే చిన్న పిల్లలకు హార్ట్ కు సంబందించిన ఆపరేషన్స్ చేయించి ట్రస్ట్ తో సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

ఇక ఇప్పుడు ఆమె మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. అందుకోసం అభిమానులు కూడా తోడుగా రావాలని కోరుతోంది. అక్షయ పాత్ర అంటే ఏమిటో అందరికి తెలిసిందే. ఆకలి తీర్చే అక్షయపాత్రకు సమంత ఇప్పుడు రూపం కల్పిస్తోంది. కొంత మంది స్కూల్ చిల్డ్రన్ ఆకలి తీర్చడానికి తనదైన శైలిలో ప్రయత్నం చేస్తోంది. గతంలో దర్శకుడు రాజమౌళి కూడా అక్షయ పాత్ర గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సమంత అందులో జాయిన్ అయ్యింది.

ఈ ఏడాది కుటుంబం 100 మంది స్కూల్ చిల్డ్రన్స్ తో లంచ్ షేర్ చేసుకుంది. మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఇచ్చే 950 రూపాయలు ఒక ఏడాది పాటు పాఠశాల విద్యార్థులకు మంచి లంచ్ ఇవ్వడానికి దోహదపడుతుంది అని సమంత ట్వీట్ చేస్తూ అందుకు సంబందించిన లింక్ ను షేర్ చేశారు.