Begin typing your search above and press return to search.

మీటూ : తన ఆత్మకు మద్దతుగా సమంత

By:  Tupaki Desk   |   11 Oct 2018 6:19 AM GMT
మీటూ : తన ఆత్మకు మద్దతుగా సమంత
X
బాలీవుడ్‌ లో తనూశ్రీ దత్తా సంచలనం సృష్టిస్తే ఆమెను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని తమిళ సింగర్‌ చిన్మయి లైంగిక ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తాను చిన్నప్పుడు - సింగర్‌ గా కెరీర్‌ ను మొదలు పెట్టిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను - లైంగిక వేదింపులను చిన్మయి మీడియా ముందుకు తీసుకు వచ్చింది. తమిళంలో మీటూ ఉద్యమంను సీరియస్‌ గా ముందుకు తీసుకు వెళ్తున్న చిన్మయిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా చిన్మయి ప్రముఖ తమిళ రచయిత, కవి అయిన వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళ సినిమా పరిశ్రమలోని ఇతర సింగర్స్‌ తన వద్ద వైరముత్తు గురించి చెప్పిన విషయాలు అంటూ పలు సంచలన ఆరోపణలు చేయడంతో ఆమెపై తమిళ సినీ ప్రముఖులు భగ్గుమంటున్నారు. వైరముత్తు వంటి వ్యక్తి గురించి ఆరోపణలు చేస్తున్నావంటూ చిన్మయిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో సమంత మాత్రం చిన్మయికి మద్దతుగా నిలిచింది.

సమంత ఆత్మగా చిన్మయిని పిలుస్తూ ఉంటారు. సమంత నటించిన ఎక్కువ శాతం సినిమాలకు చిన్మయి డబ్బింగ్‌ చెప్పింది. చిన్మయి డబ్బింగ్‌ అయితేనే సమంతకు సూట్‌ అవుతుందనే స్థాయికి పరిస్థితి చేరింది. అందుకే సమంతకు చిన్మయి ఆత్మ అంటారు. అలాంటి చిన్మయికి తాజాగా సమంత మద్దతుగా నిలవడం జరిగింది. తాజాగా సోషల్‌ మీడియాలో సమంత.. నాకు పదేళ్లుగా చిన్మయి తెలుసు, ఆమెకు నేను మద్దతుగా నిలుస్తాను #istandwithchinmayi అంటూ సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సమంతతో పాటు మరికొందరు కూడా చిన్మయికి తమ మద్దతు తెలుపుతున్నారు. లైంగిక వేదింపులకు గురైన అమ్మాయిలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరు కూడా మీటూ ఉద్యమంలో పాల్గొనాలంటూ చిన్మయి మద్దతుదారులు కోరుతున్నారు.