Begin typing your search above and press return to search.

సామ్ అలా అనకుండా ఉండాల్సిందే

By:  Tupaki Desk   |   12 Oct 2017 11:30 PM GMT
సామ్ అలా అనకుండా ఉండాల్సిందే
X
టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత.. ఇప్పుడు అక్కినేని వారి ఇంటి కోడలు అయిపోయింది. అక్కినేని కుటుంబంలో భాగమైన ఈమె.. తాజాగా సోషల్ మీడియాలో తన పేరును అక్కినేని సమంత అని అధికారికంగానే మార్చేసుకుంది. వారం క్రితమే పెళ్లి పీటలెక్కిన ఈ బ్యూటీ.. అప్పుడే ప్రొఫెషనల్ యాంగిల్ లోకి కూడా వచ్చేసింది.

తన లేటెస్ట్ మూవీ రాజుగారి గది2 చిత్రానికి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటోంది సమంత అక్కినేని. సామ్ పెళ్లి తర్వాత విడుదల అవుతున్న తొలి చిత్రంగా ఈ మూవీకి ఓ ప్రత్యేకత మిగిలిపోనుంది. నిన్న మీడియా మీట్లో మాట్లాడిన సమంత.. 'అక్కినేనిగా నాపై బోలెడంత బాధ్యతను మోపినట్లుగా అనిపిస్తోంది. అందరి అంచనాలను నిలబెట్టుకుంటానని నాపై నాకు నమ్మకం. అక్కినేని వారింటిలో మహిళలను పురుషులతో సమానంగా చూడడం అనే విషయం తనకు ఎంతగానో నచ్చింది' అని చెబుతూ.. తను చేసిన సినిమాలపై ఒక సెటైర్ వేసింది. 'ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో అసలు ఎందుకు ఉన్నానో కూడా తెలియదు.. కాని రాజు గారి గది క్యారక్టర్ మాత్రం వేరు'' అనేసింది.

అలా అంటూ.. ఇన్నాళ్ళూ చేసిన కొన్ని సినిమాలపై సెటైర్లు వేయడం తగునా మరి? అలాంటి కొన్ని ఫ్లాపు సినిమాల్లో కూడా సమంత చేసిన గ్లామర్ రోల్ పాత్ర వలనే కదా ఆమెకు కమర్షియల్ హీరోయిన్ అనే సూపర్ స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ వలనే ఈరోజు ఏ పాత్ర చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర హైప్ క్రియేట్ అవుతోంది. మరి సమంత అలాంటి పాత్రలపై సెటైర్ వేసేస్తే ఎలా? ఇండస్ర్టీలోకి వచ్చిన తొలిరోజునే కెపాసిటీ ప్రూవ్ చేసుకునే పాత్రలు రావుగా.

పెళ్లి తరువాత కూడా తను సినిమాలు చేసేందుకు అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన సమంత.. ఇక మీదట ఎలాంటి పాత్రలు చేస్తుందో చూడాలి