ఆ ఆట పేరేంటి సామ్

Fri Jan 11 2019 13:29:52 GMT+0530 (IST)

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి?  చెప్కోండి చూద్దాం.. నాగచైతన్య- సమంత అంటూ ఈజీగానే చెప్పేస్తారు ఫ్యాన్స్. ఇంతకీ అక్కినేని జంట ఆడుతున్న ఆట పేరేమిటో  చెప్కోండి చూద్దాం.. ఈ ఆటను ఏమని అంటారు? అంటే `గుర్రంపిల్ల` ఆట అని సరదాగా ఓ పేరు పెట్టుకుని ఆడుకుంటారు కిడ్స్  అచ్చం ఇలానే.చంటి పాపల్లా ఇంతగా జోవియల్ గా కలిసిపోయి ఉంటే కాపురాలు ఎంత హాయిగా ఉంటాయో. మొగుడు పెళ్లాలు అన్నాక చిరాకులు పరాకులు .. గిల్లికజ్జాలు మామూలుగానే ఉంటాయి. అవి కాస్తా ఒక్కోసారి శ్రుతిమించి పరాకాష్టకు చేరితేనే ఇబ్బంది! అని రియాలిటీలో అనుభవం అయిన వాళ్లెందరో. ఇకపోతే చాలా మంది కంటే ఎంతో అన్యోన్యంగా ఉంటూ సామ్ - చై జోడీ కొత్త డెఫినిషన్ ఇస్తున్నారు. అన్యోన్యంగా ఆహ్లాదంగా ఈ జంట సెలబ్రేషన్స్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు.

ఇటీవలే సామ్ ఓ హింట్ కూడా ఇచ్చింది. పచ్చళ్లు తినాలనుంది.. కొత్త సంవత్సరం కొత్త గోల్ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి ఆ సెలబ్రేషన్ మూడ్ ఈ జంటలో కనిపిస్తోందని తాజాగా రివీలైన ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. సామ్ ఏకంగా చైతూ భుజం పైకి ఎక్కి ఎంతో జాలీ మూడ్ లో కనిపిస్తోంది. అక్కినేని బోయ్ హీ మ్యాన్ లా అంత బరువు బాగానే మోస్తున్నాడు. ఆసక్తికరంగా భార్యాభర్తల కథతో - మిడిల్ క్లాస్ ఈతి బాధలతో తీస్తున్న మజిలీ చిత్రంలోనూ ఈ జంట ఇంతే ఇదిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అర్థమవుతోంది. క్రిస్మస్ - కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ని చై చాలా కొత్తగా విదేశాల్లో ప్లాన్ చేశాడు చైతన్య. ఈ వేడుకల్లో సామ్ ఇలా సెలబ్రేట్ చేసిందన్నమాట!