Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత సమంతలో మార్పు వచ్చిందిట

By:  Tupaki Desk   |   22 March 2018 12:28 PM GMT
పెళ్లి తర్వాత సమంతలో మార్పు వచ్చిందిట
X
ఆడపిల్ల అన్నాక పెళ్లి అయ్యాక మొత్తం కాకపోయినా ఎంతో కొంత అయినా మార్పు రావడం సహజం. పెళ్లికి ముందు ఉన్న ఆలోచనలు, ప్రవర్తన ఇలా ఎదో ఒకటైనా పెళ్లి తరువాత మారుతుంది. కానీ హీరోయిన్లు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు. అలాంటి వారికి సమంత విరుద్ధం.

కొత్తగా పెళ్ళైన ఏ హీరోయిన్ వద్దకు వెళ్లి జీవితంలో పెళ్లి తర్వాత ఏం మారింది అని అడిగినా ఎబ్బెబ్బే ఏమీ మారలేదు. అంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నాను అంటూ దాటేస్తారు. కానీ ఈమధ్యనే ప్రియుడు నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని ధైర్యంగా చెబుతోంది. పెళ్లి తర్వాత ఆమెలో సంప్రదాయం ఆమెకు చాలా బాగా కనిపిస్తోందంట. ఎక్కడికి వెళ్లినా ఇల్లాలికి దృష్టి అంతా ఇంటి పైనే ఉంటుంది కదా. అలానే సమంత కు కూడా ఉందంట. కొత్త జీవితాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్నాను అని చెప్తూ పెళ్లి తనలో చాలా మార్పు తెచ్చింది అంటూ చెప్తోంది.

కాకపోతే వ్యక్తిగతంగా అంత మార్పు వచ్చినా, వృత్తిపరంగా మాత్రం ఎటువంటి మార్పు రాలేదట. ఏదైనా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంటే, స్క్రిప్తులో ఎదో ఒక బలమైన పాయింట్ ఉండాలని అందులో మాత్రం ఏ మాత్రం తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్తోంది సామ్. అలాగే సినిమా పై తనకున్న ప్రేమను, మమకారాన్ని కూడా చెప్పుకొచ్చింది ఈ అక్కినేని కోడలు.