Begin typing your search above and press return to search.

ఈ సినిమాలను డిస్టర్బ్ చేస్తున్న సమంత

By:  Tupaki Desk   |   13 Oct 2015 10:30 PM GMT
ఈ సినిమాలను డిస్టర్బ్ చేస్తున్న సమంత
X
చియాన్ విక్రం - సౌత్ సుందరి కలిసి నటించిన జర్నీ థ్రిల్లర్ 10 - ఎన్రాదుకుళ్ల. ఈ నెల 21న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఐ ఫ్లాప్ తర్వాత విక్రం నటించిన మూవీ కావడం, దీనికి మురుగదాస్ నిర్మాణ బాధ్యతలు వహిస్తుండడం, ట్రైలర్ టీజర్ లు అద్భుతంగా ఉండడంతో.. ఫ్యాన్స్ నుంచి మంచి క్రేజ్ వచ్చింది. రిలీజ్ కి మరో వారం మాత్రమే ఉండడంతో.. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు యూనిట్. 10 ఎన్రాదుకుళ్ల కోసం హీరోయిన్ సమంత బాగా కష్టపడింది. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా స్వయంగా చేసేసి ఔరా అనిపించింది. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ విభిన్నంగా దూసుకుపోతోంది. రేడియో స్టేషన్స్ నుంచి టెలివిజన్లలో లైవ్ షోల వరకూ అన్నింటినీ కవర్ చేసేస్తోంది.

గ్లామర్ - పెర్ఫామెన్స్ ఈమెకి కామనే అయినా.. తొలిసారిగా యాక్షన్ ఓరియంటెడ్ కేరక్టర్ చేయడంతో... తనను, తన సినిమాను బాగా ప్రమోషన్ చేసుకుంటోంది శామ్. మొత్తానికి ఈ మూవీ ప్రమోషన్ కోసం చెన్నైలో పాగా వేయడంతో.. సమంత లేని ప్రభావం టాలీవుడ్ లో బాగానే కనిపిస్తోంది. అక్టోబర్ 25వరకూ సమంత అందుబాటులో ఉండడం కష్టంగా తెలుస్తోంది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, త్రివిక్రం అ..ఆ.. లలో లీడ్ హీరోయిన్ సమంత. ఈ రెండింటినీ శరవేగంగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ లీడ్ హీరోయిన్ దాదాపు 15 రోజులు జంప్ ఇవ్వడంతో.. షూటింగ్ పై ఈ ప్రభావం కనిపిస్తోంది. కంటిన్యూగా షూట్ చేసి కంప్లీట్ చేయాలన్న డైరెక్టర్స్ ఐడియాకి.. సమంత ఎఫెక్ట్ బాగానే పడింది.

అయితే.. షూటింగ్ మాత్రం ఆఫకుండా ఇతర సీన్స్ ని ముందుగా తీసేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. నటించడంతో తన పని అయిపోయిందని భావించకుండా.. ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నందుకు ప్రశంసించాలో.. లేక షెడ్యూల్ డిస్టర్బ్ అయినందుకు బాధపడాలో అర్ధంకాని పరిస్థితి. బ్యూటీ సమంత.. ఇలాంటి వాటికి ముందే ప్లానింగ్ చేసుకుంటే బాగుండేదేమో..