Begin typing your search above and press return to search.

కవర్ చేసినా ఎంత అందమో..

By:  Tupaki Desk   |   3 May 2016 9:30 AM GMT
కవర్ చేసినా ఎంత అందమో..
X
సమంత యావరేజ్ అమ్మాయి అనేవాళ్లు చాలామందే కనిపిస్తారు. వెండి తెర మీద కాకుండా.. అమ్మడ్ని బయట చూస్తే.. ఈమే సమంతానా అనే వాళ్లు ఉంటారు. కానీ.. ఏం మాయో కానీ.. సమంతను ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండటమే ఆమె స్పెషాలిటీ. విడివిడిగా చూస్తే.. ఆమెలో ఏ అందం కనిపించదు. దేనికదే చూస్తే.. వెడల్పాటి పెదాలు.. పెద్ద ముక్కు.. ఓ మోస్తరు కళ్లు.. టోటల్ గా ఓకే.. ఓకే అన్నట్లుగా ఉండే సమంతను టోటల్ గా చూస్తే అదిరిపోవాల్సిందే.

జెస్సీగా మనసు దోచుకున్న నాటి నుంచి రోజురోజుకి మిసమిసలాడే అందాలతో మరింత మనసు పారేసుకునేలా తయారవుతున్న అమ్మడు.. తాజాగా అనసూయ రామలింగంగా తెర మీద కెవ్వు కేక పుట్టించటం ఖాయంగా ఉంది. తెర మీదనే కాదు.. తాజాగా జరిగిన అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు సమంత రెఢీ అయి వచ్చిన తీరు కళ్లు తిప్పుకోలేనట్లుగా ఉంది.

పై నుంచి కింద వరకూ మొత్తంగా కవర్ చేసినట్లుగా కనిపిస్తూనే.. బుజ్జి..బుజ్జి అందాలతో కనికట్టు చేసి పారేయటమే కాదు.. అలానే చూస్తుండిపోవాలన్నట్లుగా ఉండటం సమంతకు మాత్రమే సాధ్యమేమో. కావాలంటే.. అ..ఆ ఆడియో ఫంక్షన్ డ్రెస్ లో మెరిసిన సమంత మీద ఒక లుక్కేయండి. మీ కళ్లను పై నుంచి కింద వరకూ స్కాన్ చేస్తూ రండి.. కాసేపు అలానే ఎంగేజ్ కాకుంటే చెప్పండి. సమంతా.. ఏం మాయ చేస్తున్నావే..