Begin typing your search above and press return to search.

మహానటిలో ఈ కెమిస్ట్రీ సూపరబ్బా..

By:  Tupaki Desk   |   25 April 2018 11:53 AM GMT
మహానటిలో ఈ కెమిస్ట్రీ సూపరబ్బా..
X
ఎన్ని యాక్షన్ సినిమాలు వచ్చినా.. ఎన్ని లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు వచ్చినా.. అందరి చూపు ప్రస్తుతం ఒక చిత్రంపై స్పెషల్ గా ఉందనే చెప్పాలి. అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి తెలుసుకోవడాని ఆ తరం నుంచి నేటి తరం వరకు అందరూ చాలా ఆతృతగా మహానటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలో కేవలం సావిత్రి లైఫ్ మాత్రమే మనకు కనిపిస్తుంది అంటే పొరపాటే. ఆ కథ పక్కన మరో లవ్ స్టొరీ కూడా కనిపిస్తుంది.

సమంత - విజయ్ దేవరకొండ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వారికి సంబంధించిన స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా నేడు రిలీజ్ అయిన ఒక పోస్టర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉండే యువ జంటల మాదిరిగా సమంత - విజయ్ కొంచెం స్టైల్ గా నవ్వుతూ కనిపించారు. ఆ నాటి ఫెమాస్ గోల్డ్ స్పాట్ డ్రింక్ చేతిలో పట్టుకొని హావబావాతోనే కెమిస్ట్రీ సూపర్ అనేలా టాక్ తెచ్చేసుకున్నారు. సినిమాలో వీరి పాత్రలు మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక గురువారం సాయంత్రం 5గంటలకు "సదా నన్ను" అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. వచ్చే నెల 9న మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది.