సమంత బ్లూ టిక్స్ గోల ఏంటి గురూ

Fri May 19 2017 17:41:05 GMT+0530 (IST)

ఇప్పుడు సమంత సినిమాల్లో చేస్తున్నా చేయకపోయినా.. అసలు సోషల్ మీడియాలో కనిపించినా కనిపించకపోయినా.. ఎందుకో అమ్మడు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నాగార్జున షేర్ ఒక వాట్సాప్ మెసేజ్ కారణంగా అమ్మడు వివిధ రకాలుగా డిస్కషన్ పాయింట్ అయిపోయింది.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ నచ్చింది మామా అంటూ సమంత వాట్సాప్ చేయడాన్ని.. నాగ్ ట్విట్టర్లో షేర్ చేశారు. కోడలు పిల్ల మెచ్చుకున్నందుకు ఆనందంగా ఉందన్నట్లు తన భావాలను పంచుకున్నాడు. ఇక మ్యాటర్ ఏంటంటే.. వాట్సాప్ లో చాలామంది లాస్ట్ సీన్ ఆప్షన్ ఆఫ్ లో పెడతారు. అందువలన వారు ఎప్పుడు చివరగా ఆన్ లైన్ లో ఉన్నదీ మనం చూడలేం. ఈ మధ్యనే వాట్సాప్ ఒకరు పంపిన మెసేజ్ అవతలి వారు చదివారా లేదా అని విషయం తెలియడానికి కాను.. 'బ్లూ టిక్' ఆప్షన్ ఇచ్చారు. ఎదుటవారికి మెసేజ్ చేరితే రెండు టిక్కులు వస్తాయి.. అలాగే వారు చదివితే (ఓపెన్ చేస్తే) బ్లూ టిక్స్ వస్తాయి.

ఇప్పుడు సమంతకు నాగ్ చేసిన మెసేజ్ లను చూస్తే.. అలాంటి బ్లూ టిక్స్ ఏమీ లేవు. అంటే సమంత తను చదివిందీ లేనిదీ అవతలి వారికి తెలియకుండా ఆఫ్ చేసిందనమాట. పర్సనల్ ఫోన్ లో కూడా ఇలా టాప్ రేంజు ప్రైవసీ కోరుకుంటుందనమాట కుర్రది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/