Begin typing your search above and press return to search.

సామ్ చైతూల మధ్య సం థింగ్

By:  Tupaki Desk   |   22 July 2018 10:02 AM GMT
సామ్ చైతూల మధ్య సం థింగ్
X
పెళ్లయ్యాక అక్కినేని ఫ్యామిలీ చైతు-సామ్ కొత్త జంట దూకుడు ఇంకా పెంచింది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి చేసుకున్నాక స్పీడ్ తగ్గించేస్తున్నట్రెండ్ లో సమంతకు అవకాశాలు వెల్లువలా వస్తుండటం విశేషమే. పైగా ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన మూడు సినిమాల్లో రెండు తనవే ఉన్నాయి. ఇవి కాకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా కూడా తన ఖాతాలోనే పడింది. నాగ చైతన్య కూడా తానేం తక్కువ తినలేదు అనే రీతిలో సినిమాలు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. శైలజారెడ్డి అల్లుడు-సవ్యసాచి ఇంచుమించు ఒకే స్టేజిలో ఫస్ట్ కాపీకి దగ్గరగా ఉన్నాయి. ఏది ముందు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక ఈ ఇద్దరు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా గురించి అప్పుడే అభిమానుల్లో అంచనాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు యాడ్స్ లో కూడా సామ్ తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంది.

తాజాగా రెక్సోనా రూపొందించిన యాడ్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అనే క్యాప్షన్ తో రూపొందించిన ఈ ఫోటో షూట్ తాలూకు పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సామ్ ని చూపించకుండా చైతుని మాత్రమే ఫ్రంట్ యాంగిల్ లో ఫోజిప్పించి తన కళ్ళలో ఆనందాన్ని ప్రోజెక్ట్ చేసిన తీరు అభిమానులకు భలే కిక్ ఇస్తోంది. ఇద్దరు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు కావడంతో వీళ్లకు సంబంధించిన ఏ పిక్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. రెక్సోనా షొప్ యాడ్ కూడా ఇదే బాపతులో చేరింది. మరి చైతు జంట ఇంతగా చెబుతున్నారు అంటే రెక్సోనా సోప్ ఫాన్స్ ట్రై చేసినా చాలు సేల్స్ పెరిగేలా ఉన్నాయి.