వైరల్ వీడియో: చైసామ్ చింపేశారుగా..!

Wed Oct 09 2019 15:33:15 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఉండే క్యూట్ కపుల్స్ లో నాగ చైతన్య - సమంతా జంట ఒకటి.  కొన్నేళ్ళ పాటు లవ్.. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటైన ఈ జంట అప్పటి నుంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదానికి అర్థంలా నిలుస్తున్నారు.  ఈమధ్యే రెండో మ్యారేజ్ యానివర్సరీ జరపుకున్న ఈ జంటకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజా చై-సామ్ జంట డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రికీ మార్టిన్ సూపర్ హిట్ సాంగ్ 'లివిన్ లా వీడా లోకా' కు ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు. మొదట చైతును సామ్ పిలుస్తూ స్టెప్స్ మొదలు పెడుతుంది.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చైతు జాయిన్ అయ్యి సూపర్ స్టెప్పులతో సామ్ కు పోటీ ఇచ్చాడు. ఇద్దరూ ఈ వీడియోలో యమా స్టైలిష్ గా ఉన్నారు.  సామ్ ఒక ఫ్లవర్ డిజైన్ టాప్.. డెనిమ్ షార్ట్ తో మోడరన్ గా ఉండగా చైతు కూడా క్యాజువల్ టీ షర్టు.. జీన్స్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

మరి ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ ఒకసారి చూస్తే చాలు రిపీట్ మోడ్ లో చూడాలనిపించేలా ఉంది. సామ్  హంగామా.. అల్లరి సంగతి అందరికీ తెలుసు కానీ ఇలా చైతు కూడా డ్యాన్స్ లో సామ్ తో జాయినై పోటీగా స్టెప్పులు వేయడం వీడియోకే హైలైట్ గా ఉంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.  ఇక సినిమాల విషయానికి వస్తే చైతు 'వెంకీమామ' లో నటిస్తున్నాడు.  సమంతా '96' రీమేక్ లో నటిస్తోంది.