మళ్లీ రామలక్ష్మి గెటప్ లో సమంత

Tue May 15 2018 13:24:26 GMT+0530 (IST)

చెన్నై సుందరాంగి సమంత.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదగడం మాత్రమే కాదు.. ఇప్పుడు తెలుగింటి కోడలు కూడా అయిపోయింది. అక్కినేని వారి కోడలుగా మారిన తర్వాత.. సమంత సినిమాలు చేస్తుందా లేదా అనే అంశంపైనే చాలా సందేహాలు వచ్చాయి. కానీ ఇలాంటి వాటన్నిటికీ తన సినిమాలతోనే సమాధానం ఇచ్చింది సామ్.పెళ్లి తర్వాత సమంత నుంచి వచ్చిన మొదటి మూవీ రాజు గారి గది2. ఈ మూవీ సక్సెస్ కాలేదు కానీ.. దెయ్యంగా సమంత యాక్టింగ్  కు మంచి పేరే వచ్చింది. రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో సామ్ చేసిన డీగ్లామ్ రోల్ రామలక్ష్మి క్యారెక్టర్ కు అయితే.. ఆమె ప్రాణం పోసేసింది. ఇక రీసెంట్ రిలీజ్ మహానటిలోనూ మధురవాణి పాత్రతో ఆకట్టుకున్న సామ్.. ఇకపై కూడా జోరు చూపించేందుకు ఫిక్స్ అయింది. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి తో సీమ రాజా అనే చిత్రంలో లీడ్ హీరోయిన్ రోల్ కు ఒప్పుకుంది సమంత.

ఇందులో కూడా సామ్ చేయబోయే క్యారెక్టర్.. రంగస్థలం మాదిరిగానే ఉంటుందట. ఈ పాత్ర కోసం సిలాంబం అనే మార్షల్ ఆర్ట్ ను కూడా సమంత నేర్చుకోవడం విశేషం. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు.. విశాల్ తో కలిసి సమంత నటించిన ఇరుంబు తిరైకు సక్సెస్ టాక్ రావడంతో.. సమంత ఫుల్లు హ్యాపీగా ఉంది.