ఆ రీమేక్ పై సామ్ కామెంట్!?

Thu Oct 18 2018 23:33:40 GMT+0530 (IST)

మంచి కథలు దొరికితే మన మేకర్స్ అసలు వదిలిపెట్టరు. ఇరుగు పొరుగు భాషల్లో సినిమాల్ని పరిశీలించి అక్కడ హిట్టయిన కథల్ని కొనుక్కుంటున్నారు. ఆ కోవలోనే తమిళంలో ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించిన 96 కథను కొనుక్కున్నారు దిల్‌రాజు. త్రిష విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన 96 రియలిస్టిక్ ఎప్రోచ్‌తో తీసిన సినిమా. నటీనటుల ప్రదర్శనకు చక్కని పేరొచ్చింది. ఓ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని విచారకరమైన ఎండింగ్‌తో చూపించినా తంబీలు బంపర్ హిట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రనిర్మాత దిల్‌రాజు సన్నాహకాల్లో ఉన్నారు.అంతేకాదు.. ఈ సినిమాలో సమంత నటిస్తే బావుంటుందనేది రాజా ఉవాచ. విజయ్ సేతుపతి పాత్రలో నాని అయితే సూటబుల్ అని భావించారు. అయితే  `ఇలాంటివి రీమేక్ చేయకూడదు రాజా` అనే అర్థంలో సామ్ ఇచ్చిన సలహా కలకలం రేపింది. ఆ సినిమా తీయొద్దనేది తన ఉద్ధేశం కాకపోవచ్చు. కానీ దానిని టచ్ చేయకపోవడమే మంచిది! అనేది తన ఉద్ధేశం అని అందరికీ అర్థమైంది. ఆ రెండిటికి మధ్య సన్నని లైన్‌ని దిల్‌రాజు అర్థం చేసుకుంటారా?   లేదా అన్నది అసలైన పాయింట్. దిల్‌రాజుకు ఇది సామ్ ఇచ్చిన సలహా అని కూడా భావించాల్సి ఉంది.

ఒకవేళ ఈ సినిమాని రీమేక్ చేస్తే ఎవరు డైరెక్ట్ చేస్తారు? అంటే హరీష్ శంకర్‌కి ఆ ఛాన్సు ఉందని దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని రీమేక్‌లు ఒకేలా ఉండవు అన్న చందంగా కాకుండా.. ష్యూర్ షాట్‌గా హిట్టు కొట్టేలా తీయడంలో హరీష్ సత్తా చాటాల్సి ఉంటుంది. అప్పుడే సమంత ఉద్ధేశం రాంగ్  అని ప్రూవ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి సమంత ఓకే చెబుతుందా.. లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.