Begin typing your search above and press return to search.

బెల్జియంలో ఎంజాయ్ చేస్తున్న తారామణులు

By:  Tupaki Desk   |   24 July 2016 12:50 PM GMT
బెల్జియంలో ఎంజాయ్ చేస్తున్న తారామణులు
X
టుమారో ల్యాండ్ 2016.. అంటూ ఇప్పుడు బెల్జియంలో దేశం రాజధాని బ్రస్సెల్స్ లో ఒక మ్యూజిక్ కన్సార్ట్ జరుగుతోంది. ప్రపంచంలోని చాలామంది ఔత్సాహిక మరియు టాలెంటెడ్ మ్యూజిషియన్లు అక్కడ లైవ్ లో వాయిస్తుంటే ఆ కిక్కే వేరంతే. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కు టాలీవుడ్ నుండి కూడా ఎటెండన్స్ ఉందండోయ్.

అవును.. ఆల్రెడీ గత వారం నుండి యురోప్ లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరో నితిన్‌.. డిజైనర్ నీరజ కోన.. తదితరులు అక్కడే ఉన్నారు. వీరందరూ బ్రసెల్స్ చేరుకునేలోపు.. ఇక్కడ నుండి సమంత - రకుల్ ప్రీత్ - రెజీనా వంటి భామలు కూడా అక్కడ అడుగెట్టేశారు. అదిగో అక్కడ చూడండి.. నీరజతో కలసి మన స్పయిసీ హీరోయిన్లు ముగ్గురూ ఎలా ఫోజులిస్తున్నారో. వీరందరూ కూడా సండే అంతా అక్కడ టుమారోల్యాండ్ ఫెస్టివల్ లో స్పెండ్ చేసి.. ఓ రెండు రోజుల్లో తిరిగొచ్చేస్తారట.

ఇకపోతే వీరు మాత్రమే కాదు.. ప్రస్తుతం యురోప్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న రవితేజ కూడా ఈ ఫెస్టివల్ కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయమే ఆయన కూడా బెల్జియం చేరుకున్నాడు. ఇంకా చాలామంది కుర్ర హీరోలు కూడా అక్కడికే వెళ్ళినా.. ఆ విషయం కాస్త సీక్రెట్ గా ఉంచారట.