Begin typing your search above and press return to search.

మాజీ లవర్స్ తాజా ట్విట్టర్ ఫైట్

By:  Tupaki Desk   |   29 Nov 2015 7:04 PM GMT
మాజీ లవర్స్ తాజా ట్విట్టర్ ఫైట్
X
సమంత, సిద్ధార్ధలు మాజీ లవర్స్ అని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ప్రేమించుకన్న విషయాన్ని కానీ, విడిపోయిన విషయాన్ని కానీ వాళ్లు డైరెక్టుగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ రిలేషన్ గురించి, బ్రేకప్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ మాత్రం అప్పుడప్పుడూ పేలాయి. విడిపోయిన తర్వాత ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఈ జంట.. ఇప్పుడు ట్విట్టర్ లో డైరెక్టుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

రీసెంట్ గా సిద్ధార్ద చేసిన ఓ ట్వీట్ శామ్స్ కి బాగా కోపం తెప్పించింది. దీనికి వెంటనే బదులిచ్చేసిందీ భామ. ఇంతకీ సిద్ధూ చేసిన కామెంట్ ఏంటంటే.. "నీ జీవితంలో అత్యంత బాధ కలిగించే క్షణం అని నువ్వు ఏదైతే అనుకుంటావో.. బహుశా అదే నీకు అద్భుతమైన క్షణం కావచ్చు" అని. సిద్ధూ ఈ ట్వీట్ చేయగానే.. "ఆ క్షణం ఏదంటే.. నువ్వు నా దృష్టిలో మిగిలిన అందరితో సమానం అని నేను తెలుసుకున్నదే" అంటూ సమంత ట్వీట్ చేసేసింది.

అయితే.. తన ట్వీట్ ని కొంత సేపటి తర్వాత సమంత డిలెట్ చేసేసినా.. అప్పటికే ఇది పాపులర్ అయిపోయింది. ఇద్దరి మధ్య ఇంతగా అగాధం ఉందా అని.. ఫ్యాన్స్ ని బాగా ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. నిజానికి వీళ్లిద్దరూ జబర్దస్త్ షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు కానీ.. అభిప్రాయబేధాలు దూరం చేసేశాయి. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా ఉంటూ.. సడెన్ గా ట్విట్టర్ వార్ కి తెర తీయడం.. ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.