Begin typing your search above and press return to search.

సల్మాన్‌ అలాంటివి చేయొద్దన్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:47 AM GMT
సల్మాన్‌ అలాంటివి చేయొద్దన్నారు
X
భజరంగి భాయిజాన్‌ చిత్రంలో నటించి అందరి మనసులు దోచుకుంది క్యూట్‌ హర్షాలీ మల్హోత్రా. బాలనటిగా చక్కని అభినయంతో ఆకట్టుకుంది. పాకిస్తాన్‌ బార్డర్‌ లో తమాషా కథాంశంలో హర్షాలీ పెర్ఫెక్ట్‌ గా సూటయ్యిందన్న పేరొచ్చింది. ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం ఆఫర్ల వెల్లువ మొదలైంది. వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఓ వైపు వెండితెర, మరోవైపు బుల్లితెర రెండు వైపులా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే హర్షాలీ తల్లిదండ్రులు మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. హీరో సల్మాన్ ఖాన్ , దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఇటీవలే హర్షాలీ తల్లిదండ్రులకు ఓ మాట చెప్పారు. మంచి అవకాశాలు వచ్చే వరకూ వేచి చూడండి. ఏదో ఒకటి మనవైపు వచ్చింది కదా! అని అంగీకరించవద్దు అని చెప్పారు. అందుకే కాస్త ఆలోచిస్తున్నా. టీవీ సీరియళ్లు, బుల్లితెర షోలలో పాల్గొనవద్దు. ఓ పెద్ద సినిమా అవకాశం వస్తేనే ఎంకరేజ్‌ చేయండి అంటూ సల్మాన్‌ సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని హర్షాలీ తల్లి గారైన కాజల్‌ చెప్పారు. బాల నటుల్లో బేబి షామిలి, బేబి షాలినికి అప్పట్లో బోలెడంత పేరొచ్చింది. మళ్లీ ఇప్పుడు హర్షాలీ పేరు ఆ రేంజులో వినపడుతోంది.