Begin typing your search above and press return to search.

నలుగురు భామలు.. సల్మాన్‌ కే టోపీ

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:30 AM GMT
నలుగురు భామలు.. సల్మాన్‌ కే టోపీ
X
అప్పుడ‌ప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవాక్క‌య్యేలా చేస్తాయి. ఓ స్టార్ హీరో విష‌యంలో అలాంటి ఓ సంఘ‌ట‌న ప్ర‌స్తుతం బాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. కండ‌ల హీరో స‌ల్మాన్‌ ఖాన్‌ ని ఓ న‌లుగురు అమ్మాయిలు ఫ్యాన్స్ అని చెప్పుకుని దారుణంగా మోసం చేశారు. అంతేనా.. అత‌డి వ‌స్తువుల‌న్నీ కొట్టేయ‌డం ప్ర‌స్తుతం బి-టౌన్‌ లో హాట్ టాపిక్‌. ఇంకాస్త వివ‌రాల్లోకి వెళితే...

బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్‌ ఖాన్ ముంబై బాంద్రాలో ఓ నైట్‌ క్ల‌బ్‌ కి వెళ్లారు. అక్క‌డ త‌న‌కి ఓ న‌లుగుర‌మ్మాయిలు ప‌రిచ‌యం అయ్యారు. మేం మీ వీరాభిమానులం అంటూ ఆ అమ్మాయిలే త‌మంత‌ట తాముగా ప‌రిచ‌యం చేసుకున్నారు. ఆ టైమ్‌ లో స‌ల్మాన్ కొద్దిసేపు వారితో ముచ్చ‌ట్లాడారు. ఆ ముచ్చ‌ట్లలోనే ప‌క్క‌నే ఉన్న ఓ టేబుల్‌ పై త‌న వ‌స్తువుల‌న్నీ ఉంచి ఎటో వెళ్ళాడు సల్లూ భాయ్‌. అత‌డు ఓ నిమిషంలోగా ప‌ని పూర్తి చేసుకుని వ‌చ్చేలోగానే ఆ టేబుల్‌ పై వ‌స్తువుల‌న్నీ మాయం. అంతేకాదు ఫ్యాన్స్ అని చెప్పుకున్న స‌ద‌రు అమ్మాయిలంతా అక్క‌డ క‌నిపించ‌లేదు. వ‌స్తువులు మిస్సింగ్‌. అమ్మాయిలు మిస్సింగ్‌. దాంతో స‌ల్మాన్ ఒక్క‌సారిగా అవాక్క‌య్యాడు. అయితే ఈ విష‌యాన్ని మింగ‌లేక క‌క్క‌లేక అన్న‌ట్టు ఎవ‌రికి తెలియ‌కూడ‌ద‌ని అనుకున్నాడు స‌ల్మాన్‌. సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ కి ఫిర్యాదు చేయ‌మ‌ని చెప్పినా స‌ల్మాన్ సున్నితంగా తిర‌స్క‌రించాడు.

ఆ మ‌రుస‌టిరోజు జుహూ ప్రాంతంలోని ఓ స్టార్ హోట‌ల్‌ లో సినిమా ఫంక్ష‌న్‌ కి అటెండ్ అయిన స‌ల్మాన్ వేదిక‌పై మాట్లాడుతూ.. ముంబై మ‌రీ అంత సేఫ్ ప్లేస్ కాదు. ఎప్పుడు, ఎక్క‌డ ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంది అంటూ బాధ‌ని వెల్ల‌గ‌క్కాడు. ప్చ్ స‌ల్మాన్‌. పోగొట్టుకున్న‌వి ఎంతో విలువైన వ‌స్తువులు. అందుకే అంత ఫీల‌య్యాడ‌న్న‌మాట‌!