Begin typing your search above and press return to search.

కండల వీరుడి అప్ లోడింగ్ కి అన్నికోట్లా..?

By:  Tupaki Desk   |   27 March 2017 4:27 PM GMT
కండల వీరుడి అప్ లోడింగ్ కి అన్నికోట్లా..?
X
బాలీవుడ్ కండలవీరుడిగా సల్మాన్ ఖాన్ సుపరిచితుడు. యాభైకి దగ్గర పడుతున్నాపెళ్లి చేసుకోని ఇతగాడు.. తనకున్న ఇమేజ్ ను సొమ్ము చేసుకోవటంలో మొనగాడనే చెప్పాలి. తనకున్న పరిపతిని 360డిగ్రీల్లో క్యాష్ చేసుకునే అద్భుతమైన మేధస్సు సల్మాన్ సొంతం. బాలీవుడ్ యాక్టర్ గా పలుబ్రాండ్లకు అంబాసిడర్ గా.. షోలకు యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్న ఏఅంశం మీదనైనా సొమ్ము చేసుకునే సత్తా సల్మాన్ సొంతం.

తాజాగా తనకున్న క్రేజ్ ను అతగాడు కోట్ల రూపాయిలుగా మార్చుకున్న వైనం వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాజాగా ఒక కళ్లజోడు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పుకున్న సల్మాన్.. ఆకంపెనీ కమర్షియల్ లోనూ నటించాడు. దీనికి మంచిగానే ముట్టిందట. ఇదంతా రోటీన్ యవ్వారమే. కానీ.. ఇప్పుడు చెప్పేదే అసలుసిసలైన కొత్త కాన్సెప్ట్.

అదేమంటే.. కోట్లాది రూపాయిలు తీసుకొని తాను నటించిన యాడ్ ను తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయటానికి ఏకంగా రూ.10కోట్లు తీసుకున్నాడట. అయ్యగారు నటించిన యాడ్ ను కోట్ల రూపాయిలు ఖర్చు చేసి.. అతగాడి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయాల్సిన పనేముందంటే..దానికో లాజిక్ ఉంది. ట్విట్టర్ ఖాతాలో సల్మాన్ ను ఫాలో అయ్యే వారు లక్షలాదిగా ఉన్నారు. ఆయన పోస్ట్ చేసే పోస్ట్ ఆ లక్షలాది మందికి నేరుగా వెళ్లి చేరుతుంది. ఎన్నిటీవీలకు కమర్షియల్స్ ఇస్తే మాత్రం.. ఎంతమందికి చేరుతుందో కచ్ఛితంగా లెక్క తెలీని దాంతో పోలిస్తే..పక్కాగా చేరుతుందన్న నమ్మకం ఉన్న ట్వీట్ కు కోట్లు ఇస్తే తప్పేముందన్న ప్రశ్నకు ఫ్లాట్ అయి.. కండల వీరుడి ట్విట్టర్ లో యాడ్ అప్ లోడ్ చేసినందుకు ఏకంగా రూ.10కోట్లు ఇచ్చారట. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లుగా.. సంపాదించుకోవాలన్న మైండ్ సెట్ ఉండాలే కానీ.. కోట్లు సంపాదించటానికి ఎన్ని మార్గాలో కదూ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/