మహేష్ టైటిల్ తో సల్మాన్

Tue Oct 24 2017 12:56:38 GMT+0530 (IST)

టాలీవుడ్ సూపర్ స్టార్ మాహేష్ బాబు సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన ఎంచుకున్న టైటిల్స్ చాలా బావుంటాయని చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా ఆయన సినిమాల టైటిల్స్ ఉంటాయని సౌత్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. రీసెంట్ గా స్పైడర్ సినిమా టైటిల్ కూడా చాలా పాపులర్ అయ్యింది. సినిమా ఊహించినంత స్థాయిలో లేకపోవడంతో అపజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా పై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 2018 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భరత్ అనే పేరు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బాగానే వినిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ఒకే చేసిన ఒక ఒక కథకు భరత్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం సల్లు బాయ్ అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో టైగర్ జిందా హై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కత్రినా హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది. క్రిస్మస్ కి సినిమా విడుదల కానుంది. అయితే ఆ సినిమా అయిపోగానే అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. దానికి భరత్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ షూటింగ్ ను మొదలు పెట్టి 2019లో సినిమాను రిలీజ్ చేస్తారట.