బాలీవుడ్ టైగర్ కి మాయరోగం

Fri May 19 2017 16:05:53 GMT+0530 (IST)

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అనే స్టేటస్ కన్నా అభిమానులు గుండెలో అతని స్థానం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండే తన లూక్స్ తో యూత్ ని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటికీ తను యూత్ లానే కనిపిస్తాడు. దేశం లోనే తన సిక్స్ ప్యాక్ ని  పొగరుగా చూపించిన మొదటి నటుడు. మిడ్ లైఫ్ వయసు దాట్టిన సల్మాన్ ఎప్పుడు ఫిట్ గా కనిపిస్తాడు. ఈ వయసులో కూడా అలా బాడీని కాపాడుకోవడం చాలా కష్టం కాని.. ఈ విషయం లో సల్మాన్ కు పోటీ వచ్చే హీరో లేడనే చెప్పాలి. కాకపోతే ఇంతటి బలుడు కూడా బయటకు కనిపించని భయంకర రోగంతో పోరాడుతున్నాడు.
 
ఏడున్నరేళ్లుగా ట్రై జెమినల్ న్యూరాల్జియా రోగంతో బాధపడుతున్నాడు సల్మాన్ ఖాన్. ఇది నరాల అస్తవ్యస్థతకు సంబంధించిన రోగం. ఏమాత్రం తేడా చేసిన తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బి తలనొప్పి తీవ్రంగా వస్తుంది. తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రమోషన్లో భాగంగా దుబాయ్ వెళ్లిన సల్మాన్ అక్కడ ఈ విషయాల్ని మీడియా ముందు ఉంచాడు. తలనొప్పి ఎంత భాదపెడుతున్నా కూడా అభిమానుల్ని అలాగే నన్ను నమ్ముకున్న కుటంబాలను తలుచుకొని సినిమాలు చేస్తుంటానని చాలా ఎమోషనల్ గా చెప్పాడు. ఈ మహమ్మారి  ట్రీట్ మెంట్ కోసం ఓసారి అమెరికా కూడా వెళ్లొచ్చాడట. దాదాపు 8 నెలల పాటు అక్కడే  హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో ట్రీట్ మెంట్ను వాయిదా వేశాడని తెలుస్తోంది.

ఇంటెర్నేషల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన సినిమా ట్యూబ్ లైట్ పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి మరి ఇప్పుడైనా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటాడో లేదో తెలియదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/