పిల్లలు కావాలి.. భార్య వద్దంటున్న స్టార్ హీరో!

Thu May 23 2019 07:00:02 GMT+0530 (IST)

తనకు పిల్లలు కావాలని అంటున్నాడు సల్మాన్ ఖాన్. 'భారత్' సినిమా విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా స్పందించారు. తనకు పిల్లల మీద ఆపేక్ష ఉందని - తనకూ సంతానం కావాలని ఉందని సల్మాన్ ఖాన్ చెప్పాడు.ఇప్పటి వరకూ బ్యాచిలర్ గానే ఉండిపోయిన ఈ యాభై మూడేళ్ల బాలీవుడ్ స్టార్ హీరో - మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్.. ఇలా పిల్లలపై మమకారాన్ని చాటుకున్నాడు. తన తోబుట్టువుల పిల్లలతో సల్మాన్ ఖాన్ చాలా ఆపేక్షతో ఉంటాడు. తన తమ్ముడి పిల్లలు - చెల్లెళ్ల పిల్లలతో సల్మాన్ ఎంతో క్లోజ్ గా ఉంటాడు.

అయితే సల్మాన్ కు మాత్రం పెళ్లి లేదు. చేసుకుంటాడని ఫలానా హీరోయిన్ ని చేసుకోబోతున్నాడని చాలా సార్లు వార్తల్లోకి వచ్చాడు సల్మాన్. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ కు సల్మాన్ ఖాన్ పెళ్లి ఒక పెద్ద చర్చనీయాంశంగా నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ అది అలాగే మిగిలిపోయింది.

ఇలాంటి నేఫథ్యంలో సల్మాన్ మాట్లాడుతూ.. తనకు పిల్లలు కావాలని - కానీ భార్య వద్దు అని వ్యాఖ్యానించాడు. కానీ పిల్లలకు తల్లి అవసరం ఉంటుందని వాళ్లకు అన్నీ తనే అయ్యి పెంచగలనంటూ సల్మాన్ చెప్పాడు.
సల్మాన్ ఖాన్ సరోగసి పద్ధతిలో పిల్లలను పొందబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి.