Begin typing your search above and press return to search.

పెళ్లికాని బ్యాచిల‌ర్ పిల్ల‌లంటే పిచ్చి..

By:  Tupaki Desk   |   10 Sep 2018 4:49 AM GMT
పెళ్లికాని బ్యాచిల‌ర్ పిల్ల‌లంటే పిచ్చి..
X
50 వ‌య‌సు పెళ్లి కాని బ్యాచిల‌ర్ .. ఆయ‌నో వింత‌! పెళ్లెప్పుడు? అని ప్ర‌శ్నిస్తుంటే.. ప్ర‌తిసారీ ఏవో స‌మాధానాలు చెబుతున్నాడు. అస‌లు ఇప్పుడే పెళ్లేంటి? అంటూ ప‌రాచికం ఆడుతున్నాడు. మీడియా వాళ్ల‌ను అదోలా చూస్తున్నాడు. అస‌లు వీళ్ల‌కు కొంచెమైనా జ్ఞానం - ఇంగితం ఉందా? అన్న ఎక్స్‌ ప్రెష‌న్ ప్ర‌తిసారీ ఆ క‌ళ్ల‌లో క‌నిపిస్తూనే ఉంది. అయినా మీడియా వాళ్లు అదే ప్ర‌శ్న అడుగుతుంటారు. య‌థావిధిగా ఆయ‌న అదే స‌మాధానం ఇస్తుంటాడు. ఎవ‌డి ప‌ని వాడు చూస్కోకుండా - ప‌క్కోడి ప‌ని గురించి ఆలోచించే వాళ్లే ఈ లోకంలో ఎక్కువ కాబ‌ట్టి - స‌ల్మాన్ బ్యాచిల‌ర్‌ షిప్‌ ని ప్ర‌శ్నించే వాళ్లే ఎక్కువ‌యిపోయారు.

అదంతా అటుంచితే.. అస‌లు స‌ల్మాన్ భాయ్‌ కి ఫ్యామిలీ అంటే గిట్ట‌దా? పెళ్లాం వ‌స్తే అడ్డేంటి? త‌న ఆట‌లు సాగ‌వ‌నా? ఇలా ప‌రిప‌రి విధాలా దేశంలో ఉన్న అన్ని బ్యాచిల‌ర్ సంఘాల యువ‌కులు ఆ కొంటె ఆలోచ‌న‌ల‌తోనే కాలం గ‌డిపేస్తున్నారు. అయితే అన్నిటికీ చెక్ పెట్టేందుకా? అన్న‌ట్టు ఇదిగో స‌ల్మాన్ భాయ్ వేషాలు చూస్తే మీకే అస‌లు సంగ‌తి అర్థ‌మైపోతుంది. స‌ల్మాన్‌ కి కిడ్స్ పై ఉన్న అవిభాజ్య‌మైన ప్రేమ‌.. చూస్తుంటే ముచ్చ‌ట‌ ప‌డ‌కుండా ఉండ‌లేరు.

కండ‌ల‌ హీరో స‌ల్మాన్ ప‌దిమందికి సాయం చేసే మ‌న‌సున్న వాడే కాదు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునే ధాతృత్వం - హ్యుమానిటీ ఉన్న హీరో అని ఎంద‌రో కితాబిచ్చారు. ఇప్పుడు అత‌డిలోని వేరొక కోణం అంతే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఫ్యామిలీ త‌న‌కు లేక‌పోతేనేం? త‌న చెల్లి - త‌మ్ముడు అంద‌రికీ ఉన్నారు క‌దా! వాళ్లే త‌న ఫ్యామిలీ. త‌న‌కు భార్య‌ - పిల్ల‌లు లేక‌పోయినా ఆ లోటేం లేదు. వాళ్ల పిల్ల‌లే త‌న‌ పిల్ల‌లు అని భావిస్తున్నాడు. తన గారాల చెల్లాయి అర్పిత‌కు న‌చ్చినోడినిచ్చి పెళ్లి చేశాడు. అప్ప‌ట్లో హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ ఖ‌రీదైన విల్లాలాంటి హోట‌ల్లో వంద‌లాది రూమ్‌ లు బుక్ చేసి - కోట్ల‌లో ఖ‌ర్చు చేసి మ‌రీ అర్పిత పెళ్లి చేశాడు. త‌న‌కు పుట్టిన బిడ్డ‌డితో స‌ల్మాన్ ఆడుకుంటున్న తీరు చూస్తే ముచ్చ‌ట‌ప‌డ‌కుండా ఉండ‌లేరు. చెల్లి అర్పిత కొడుకు అహిల్‌ తో స‌ల్మాన్ భాయ్ ఎలా ఆడుకుంటున్నాడో.. ఆ చిన్నారి పెయింటింగ్ వేషాలు.. భాయ్ ఎంక‌రేజ్‌ మెంటూ.. ఈ ఫ‌న్నీ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. కిడ్స్ అంటే అత‌డికి ఉన్న అవిభాజ్య ప్రేమ ఏపాటిదో నేల‌పై ఆ పొర్లుదండాలే చెబుతాయి. వాటీజ్ దిస్ భాయ్‌.. నీలో ఈ కోణం కూడా ఉందా?

వీడియో కోసం క్లిక్ చేయండి