Begin typing your search above and press return to search.

ఇప్పుడు సల్మాన్ బాడీగార్డ్ వంతు!

By:  Tupaki Desk   |   26 Oct 2016 1:30 PM GMT
ఇప్పుడు సల్మాన్ బాడీగార్డ్ వంతు!
X
ఈమధ్యకాలంలో సెలబ్రెటీల బాడీగార్డ్ హడావిడి చేసిన సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు. అంధేరిలోని డీఎన్‌ నగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.00 గంటల ప్రాంతంలో షేరా ఒక వ్యక్తితో గొడవపడి, అతనిపై దాడిచేశాడట. కండలున్నాయన్న కాంఫిడెన్సో, పక్కన కండల వీరుడున్నాడనే దైర్యమో కానీ... ఏకంగా సదరు వ్యక్తిని తుపాకీ చూపించి మరీ బెదిరించాడట. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు షేరాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయాలపై స్పందించిన పోలీసులు... గొడవ ఎందుకు జరిగింది అనే విషయం కచ్చితంగా తెలియరాలేదు కానీ... ఒక వ్యక్తి వచ్చి షేరాకు ఫోన్‌ ఇచ్చాడు.. ఫోన్‌ లో అతను మాట్లాడుతూ తీవ్రంగా దుర్భాషలు ఆడాడు.. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత తన సమీపంలో ఉన్న వ్యక్తితో షేరా గొడవ పడ్డాడు.. అనంతరం షేరా అతన్ని తుపాకీతో హెచ్చరించడంతో పాటు బేస్‌ బ్యాట్‌ తో అతనిపై దాడి చేశాడు. దీంతో బాదితుడి భుజం చేరువలో ఎముక విగిరి తీవ్రగాయమైంది అని చెబుతున్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక‌్షన్‌ 326 - 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న షేరా కోసం గాలిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/