Begin typing your search above and press return to search.

మాజీ లవర్స్ ఏం పోజ్ ఇచ్చారులే!

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:27 PM GMT
మాజీ లవర్స్ ఏం పోజ్ ఇచ్చారులే!
X
ఏక్ థా టైగర్ కు సీక్వెల్ గా రూపొందిన టైగర్ జిందా హై మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మరో నెల రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ట్యూబ్ లైట్ చిత్రంతో ఫ్లాప్ ఎదుర్కొన్న సల్మాన్.. టైగర్ జిందాహై తో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాడనే అంచనాలు ఉన్నాయి.

ఇలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడడానికి కారణం.. సల్మాన్ కు బాగా అచ్చొచ్చిన యాక్షన్ మూవీ కాయడం మాత్రమే కాదు.. ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ కత్రినా కైఫ్ నటిస్తుండడం కూడా. గతంలో లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన వీరిద్దరూ.. మళ్లీ ఐదేళ్ల తర్వాత జోడీ కట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన పబ్లిసిటీ మెటీరియల్ చూస్తే.. సల్మాన్-కత్రినాలు ఇద్దరూ కలిసి రొమాన్స్ పండించేశారని అనిపించక మానదు. వరుసగా విడుదల చేస్తున్న స్టిల్స్ అయితే.. అభిమానుల్లో తెగ హుషారు తెప్పించేస్తున్నాయి. మాజీ లవర్స్ ఇద్దరి కలిసి మాంచి కెమిస్ట్రీ పండించేశారనే సంగతి అర్ధమవుతుంది.

ఒకరితో ఒకరు పోటీ పడుతున్న రేంజ్ లో ఇచ్చిన పోజులు టైగర్ జిందాహై మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ స్పై పాత్రలో నటిస్తున్న కేట్ అయితే.. షార్ట్ డ్రెస్సుల్లో తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసేసింది. సల్మాన్ ఖాన్ మూవీతో హిట్ అందుకుని మళ్లీ హిట్ అందుకోవాలన్న కసి.. ఈ భామలో కనిపిస్తోంది. మరోవైపు టైగర్ జిందా హై సక్సెస్ పై సల్మాన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.