Begin typing your search above and press return to search.

బిపాషా స్టెప్స్ కి మున్నీని మర్చిపోవాలే

By:  Tupaki Desk   |   23 April 2017 12:01 PM GMT
బిపాషా స్టెప్స్ కి మున్నీని మర్చిపోవాలే
X
బాలీవుడ్ స్టార్లతో టూర్లు ఈవెంట్లు ఎప్పుడు ఎక్కడ జరిగినా అక్కడ ఒక హోలీ జరుగుతుంది. మాటలాడుకోవడానికి కొన్ని ముచ్చట్లు.. గుసగుసలకు సరిపడా సీక్రెట్స్ మనకు ఇస్తుంది. ఇప్పుడు ఒక హాట్ వీడియొ సోషల్ మీడియా లో చూస్తున్న వారిని ఉబ్బి తబ్బిబ్బు పరుస్తుంది. అది ఏంటి అంటే బిపాషా బసు సల్మాన్ ఖాన్ ఇప్పుడు దబాంగ్ టూర్ లో హాంగ్ కాంగ్.. ఆస్ర్టేలియా వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ షో లో డాన్స్ పర్ఫార్మన్స్ చేసిన వీళ్ళ ఇద్దరు అక్కడకు వచ్చిన వీక్షకులుకు మంచి కనువిందు చేశారు.

ఈ ఈవెంట్ లో దబాంగ్ పాపులర్ సాంగ్ మున్ని బద్నామ్ పాటకు సల్మాన్ బిపాషా తో పాటు అక్షయ్ కుమార్ వారి తో పోటీ పడి డాన్స్ వేశారు. ముఖ్యం గా సెక్సీ బాంబ్ బిపాషా డాన్స్ మూవ్స్ కి అక్కడ ఉన్నవాళ్ళు తో పాటు చూస్తున్న వాళ్ళు.. నెట్ వీక్షకులు అందరకి ఒక కిక్ ఇచ్చింది. దాని తర్వాతే లైన్ లో ఉన్న సోనాక్షి డాన్స్ కూడా అందరి మతులు పోగొట్టేలా ఉంది. చూస్తుంటే ఒరిజినల్ పాటకు డ్యాన్సు వేసిన రియల్ మున్నీ మలైకా అరోరా కూడా బిపాషా స్టెప్పుల ముందు కెవ్ అనాల్సిందే. అంత హాటుగా కుమ్మేసింది మన డస్కీ సుందరి.

ఇది ఇలా ఉండగా తన పెళ్లయ్యి ఒక ఏడు పూర్తి కావస్తు ఉండడంతో ఆ క్షణం కోసం ఎదురుచూస్తుంది బిప్స్. ఏప్రిల్ 30న తన మొదటి పెళ్లి వార్షికోత్సవం జరుపుకోబోతుంది. అందుకు ప్రతీక గా తన భర్త కరణ్ సింగ్ కు ఒక మెసేజ్ పెట్టిందీ సుందరి. ''మనం కన్న కలలకు అప్పుడే ఒక ఏడు గడిచింది.. పెళ్లి అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి భర్త తో జరిగితే ఎంత హయగా ఉంటుందో.. అది నీతో ఉన్నాకే తెలిసింది'' అంటూ చెబుతూ.. అతన్ని చేరడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపింది అమ్మడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/