Begin typing your search above and press return to search.

ఫైనల్ గా సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   17 Oct 2018 1:59 PM GMT
ఫైనల్ గా సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ ఎంట్రీ!
X
సల్మాన్ ఖాన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రచారంలో ఉంటాయి.. అందులో ఒకటి అయన క్యారెక్టర్ కు సంబంధించింది. 'నవ్వు ఆయనను ఇష్టపడు లేదా ఆసహ్యించుకో కానీ గుర్తించలేకుండా ఉండలేవు'. రెండోది అయన గర్ల్ ఫ్రెండ్స్ గురించి.. 'కష్ట పడి ఆకాశంలో ఉన్న చుక్కల్ని అయినా లెక్కేయవచ్చుగానీ ప్రియురాళ్ళ సంఖ్య మాత్రం సాధ్యం కాదు'.

మరి అలా అసంఖ్యాకంగా ఉండే సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్స్ లో లూలియా వంటూర్ ఒక బ్యూటీ. రొమేనియా దేశానికి చెందిన ఈ మోడల్ కమ్ టీవీ హోస్ట్ ను దాదాపు పెళ్ళి చేసేసుకున్నాడని సలీం ఖాన్ సాబ్ ఇంటికి కోడలుగా తెచ్చాడని బాలీవుడ్ మీడియా వారు తగ టెన్షన్ పడ్డారు గానీ సల్లు భాయ్ మాత్రం అలాంటి పని మాత్రం చేయలేదు. తర్వాత ఇద్దరూ బ్రేకప్ అన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ లాంటివి లేవని అందరికీ క్లారిటీ వచ్చింది.

లూలియా వంటూర్ ఇప్పుడు 'రాధా క్యోం గోరి మై క్యోం కాలా'( తెలుగులోకి తర్జుమా చేస్తే 'రాధ ఎందుకు తెలుపు నేనెందుకు నలుపు') అనే సినిమా తో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఆ సినిమా పోస్టర్ ను సల్మాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి ఆ సినిమా టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపాడు.. ముఖ్యంగా లూలియా వంటూర్ పేరును కూడా ప్రస్తావించాడు. ఆ పోస్టర్ లో లూలియా ట్రెడిషనల్ లుక్.. టైటిల్.. 'బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్'..'#నేమ్ షేమ్ ది రేపిస్ట్స్" అనే క్యాప్షన్స్ చూస్తుంటే వివాదాలు మాత్రం తప్పవు అని అనిపిస్తోంది. జరిగేది జరగక మానదు కాబట్టి మీరు కూడా ఆ పోస్టర్ పై ఒక లుక్కేయండి.