Begin typing your search above and press return to search.

తనీ ఒరువన్ రీమేక్.. ఆయన చేయట్లేదు

By:  Tupaki Desk   |   9 Feb 2016 9:30 AM GMT
తనీ ఒరువన్ రీమేక్.. ఆయన చేయట్లేదు
X
తనీ ఒరువన్ సినిమా కోలీవుడ్ లో మాత్రమే కాదు... మిగతా ఇండస్ట్రీల్లో సైతం పెద్ద చర్చనీయాంశం అయింది. దాదాపు ఐదు భాషల నుంచి ఈ సినిమా రీమేక్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చాయి. ముందు రీమేక్ కోసం అడుగులు పడింది తెలుగు, హిందీ భాషల నుంచే. తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా తీయడానికి సన్నాహాలు జరగ్గా.. హిందీలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కథానాయకుడిగా అనుకున్నారు. తెలుగు రీమేక్ కోసం ఆల్రెడీ స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. మరోవైపు హిందీలో మాత్రం ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి.

అసలు తనీ ఒరువన్ హిందీ రీమేక్ ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా ఉన్నాయి కానీ.. ప్రస్తుతానికైతే సల్మాన్ ఖాన్ మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న మాట మాత్రం వాస్తవం. ముందు అంత ఆసక్తి చూపించిన సల్మాన్ ఇప్పుడెందుకు ప్రాజెక్టు నుంచి వైదొలిగాడన్నది అర్థం కావడం లేదు. తెలుగు వెర్షన్ విషయంలోనూ కొంత సందిగ్ధత నెలకొంది కానీ.. చివరికి సినిమా పట్టాలెక్కించడానికే రెడీ అయ్యారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి చరణ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.