Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మీకు నమ్మకం ఉందా??

By:  Tupaki Desk   |   20 April 2017 5:02 AM GMT
ఫస్ట్ లుక్: మీకు నమ్మకం ఉందా??
X
గతేడాది సుల్తాన్ మూవీతో భారీ సక్సెస్ సాధించిన సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ట్యూబ్ లైట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 23న ట్యూబ్ లైట్ ను రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడీ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు సల్మాన్ ఖాన్.

ఓ సుదీర్ఘమైన ఎడారి లాంటి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సల్మాన్ ఫోటో మాత్రమే ఇందులో కనిపిస్తుంది. అది కూడా సల్మాన్ ఫేస్ చూపించకుండా.. వెనక నుంచి చూపిన పోస్టర్ ఇది. 'మీకు నమ్మకం ఉందా' అంటూ ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఈ పోస్టర్ ను షేర్ చేసిన సల్లూ భాయ్.. 'మీకు నమ్మకం ఉందా.. మీకు నమ్మకం ఉంటే.. అతనికి మద్దతు ఇవ్వండి' అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ ఏడాది రంజాన్ కు రిలీజ్ అంటూ పోస్టర్ లోనే కన్ఫాం చేయగా.. జూన్ 23న విడుదల చేయబోతున్నామని చెప్పేశాడు దర్శకుడు.

1962 ఇండో-చైనా యుద్ధం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఓ భారతీయుడు.. పాకిస్తానీ అమ్మాయితో ప్రేమలో పడగా.. ఆమెను దక్కించుకోవడం అనే థీమ్ ప్రధానంగా కొనసాగుతుంది. చైనా అమ్మాయి పాత్రలో చైనా యాక్ట్రెస్ ఝు ఝ నటిస్తుండగా.. ఈ మూవీలో సోహైల్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. షారూక్ ఖాన్ ఓ కేమియో చేయనుండడం ఈ మూవీకి హైలైట్ కానుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/