Begin typing your search above and press return to search.

​ట్యూబులైట్ కోసం ఫేస్ బుక్ ఫిల్టర్

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:08 AM GMT
​ట్యూబులైట్ కోసం ఫేస్ బుక్ ఫిల్టర్
X
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ట్యూబు లైట్ రేపు విడుదలవుతోంది. ఏ సినిమానైనా ప్రచారంలో తనదైన శైలిలో చేస్తాడు సల్మాన్. దబాంగ్ సినిమాలో సన్ గ్లాస్సెస్ ని షర్ట్ వెనకాల పెట్టుకొని ఒక ట్రెండ్ సెట్ చేశాడు . ఇప్పుడు ట్యూబు లైట్ సినిమా లో తన మెడలో ఒక జత షూ వేలాడదీసుకొని అమాయకంగా కనిపించి మరోసారి ట్రెండ్ అయ్యాడు.

ఇప్పుడు ప్రచారం కోసం ఏకంగా ఫేస్ బుక్ ఫిల్టర్ ను క్రియేట్ చేసి ఫాన్స్ కు మరింత చేరువ అవుతున్నారు. బాలీవుడ్ లో ఇలా మార్కెట్ చేయడం ఇదే మొదటిసారి. ట్యూబు లైట్ ఫిల్టర్ గా ఇప్పుడు ఫేస్ బుక్ లో మంచి ట్రెండ్ గా గింగిరాలు తిరుగుతోంది. మీరు కూడా ఆ ఫేస్ బుక్ ఫిల్టర్ ను వాడుకునే సదుపాయం ఏర్పాటు చేశారు ట్యూబు లైట్ టీమ్ వాళ్ళు. సల్మాన్ ఖాన్ స్టైల్ లో మెడలో షూ వేసుకునట్లు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు కూడా ఒక పిక్చర్ తీసుకునే ఆప్షన్ ఇచ్చారు. లేదా వీడియో కూడా తీసి మీ సొంత ఫేస్ బుక్ స్టోరీ గా దాన్ని మార్చుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయవచ్చు.

ట్యూబు లైట్ సినిమాను సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ గా ఉంటూ హీరో గా నటించాడు. కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తమ్మడు సొహైల్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. చైనా నటి ఝూ ఝూ హీరోకు జోడీగా నటిస్తుంది. రేపు విడుదలవ్వబోయే ఈ సినిమాతో బాహుబలి 2 రికార్డులు కొట్టేస్తాడా అనేది ఇప్పుడు బాలీవుడ్ లో డిస్కషన్. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/