Begin typing your search above and press return to search.

ట్యూబ్‌లైట్ తో ఏం చేస్తాడో?

By:  Tupaki Desk   |   28 July 2016 7:30 AM GMT
ట్యూబ్‌లైట్ తో ఏం చేస్తాడో?
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సుల్తాన్ మూవీతో తను బాక్సాఫీస్ సుల్తాన్ అని మరోసారి ప్రూవ్ చేసేశాడు. ఇప్పటికే ఈ చిత్రానికి గ్రాస్ కలెక్షన్స్ 500 కోట్లు దాటాయని అంటున్నారు. ఇప్పటివరకూ ఇండియాలోనే 289కోట్లు కొల్లగొట్టిన సల్లూభాయ్.. ఈ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే టైమ్ లో తన నెక్ట్స్ పిక్చర్ ని అనౌన్స్ చేసేసి అభిమానులకు ఖుషీ ఇచ్చేశాడు సల్లూ భాయ్.

సల్మాన్ ఖాన్ తో ఏక్ థా టైగర్.. భజరంగీ భాయ్ జాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన కబీర్ ఖాన్ తోనే.. సల్లూ భాయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అనౌన్స్ చేసిన డైరెక్టర్ కబీర్.. ఈ మూవీకి 'ట్యూబ్ లైట్' అనే పేరు ఫిక్స్ చేశామన్నాడు. హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయని ట్యూబ్ లైట్ లో.. సల్మాన్ బ్రదర్ సొహైల్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇవాళే ఈ మూవీని ప్రారంభించబోతున్నారు కూడా.

ఈ మూవీలో మెజారిటీ భాగం లఢక్ లో చిత్రీకరించనుండడం విశేషం. సల్లూభాయ్ కొత్త సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. లఢక్ లో ట్యూబ్ లైట్ తో సల్మాన్ ఏం చేయనున్నాడనే ఆసక్తి మాత్రం ఇప్పటికే జనరేట్ అయింది.