Begin typing your search above and press return to search.

ఫ్లాష్ ఫ్లాష్‌: `సాహో`లో ప్ర‌భాస్-స‌ల్మాన్ షో

By:  Tupaki Desk   |   22 May 2019 5:36 AM GMT
ఫ్లాష్ ఫ్లాష్‌: `సాహో`లో ప్ర‌భాస్-స‌ల్మాన్ షో
X
డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సాహో` 2019 మోస్ట్ అవైటెడ్ మ‌ల్టీస్టార‌ర్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 250కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్- జాకీ ష్రాఫ్‌- మందిరా భేడీ త‌దిత‌ర బాలీవుడ్ స్టార్లు న‌టిస్తున్నారు. త‌మిళ స్టార్ అరుణ్ విజ‌య్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వ‌యం శంక‌ర్-ఎహ‌సాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ జాయిన్ కానుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

సాహో నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ సినిమానే కాదు.. నెవ్వ‌ర్ బిఫోర్ మ‌ల్టీస్టార‌ర్ గా మార‌బోతోంద‌ని తాజాగా సంకేతాలు అందుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ సాహో లో ఎంత‌మంది స్టార్లు ఉన్నా దాని గురించి చ‌ర్చించుకున్న‌ది త‌క్కువే. కానీ ఈ మ‌ల్టీస్టార‌ర్ కి బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ యాడ‌వుతున్నార‌న్న తాజా వార్త‌తో ఒక్క‌సారిగా అంద‌రిలో ఎగ్జ‌యిట్ మెంట్ పెరుగుతోంది. ఇంత‌కీ స‌ల్మాన్ ఈ చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించారా? లేదా? అంటే.. ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ భాయ్ తో సంప్ర‌దింపుల్లో ఉంద‌ని తెలుస్తోంది. అయితే స‌ల్మాన్ ఈ చిత్రంలో న‌టిస్తే బావుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చిన‌ది ఎవ‌రు? అంటే .. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ అత‌డి పేరును ఓ అతిధి పాత్ర‌కు సూచించార‌ని.. దాంతో వెంట‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌ల్మాన్ ని సంప్ర‌దించార‌ని ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స‌ల్మాన్ నుంచి ఓకే అన్న మాట రావాల్సి ఉందింకా.

ఇటీవ‌ల బాలీవుడ్ లో ట్రెండ్ మారింది. అక్క‌డ అగ్ర క‌థానాయ‌కులంతా ఇత‌ర హీరోల సినిమాల్లో న‌టిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూక్.. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ ఒక‌రి సినిమాల్లో ఒక‌రు న‌టిస్తున్నారు. అయితే ఓ సౌత్ సినిమాలో అతిధిగా న‌టించేందుకు స‌ల్మాన్ అంగీక‌రిస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ఒక‌వేళ ఆయ‌న అంగీక‌రిస్తే అదో గొప్ప సెన్సేష‌న్ కిందే లెక్క‌. స‌ల్మాన్ న‌టించిన భార‌త్ ఈద్ కానుక‌గా రిలీజ‌వుతోంది. సైమ‌ల్టేనియ‌స్ గా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో `ద‌బాంగ్ 3`లో న‌టిస్తున్నారు. ఈ గ్యాప్ లోనే `సాహో` కోసం కాల్షీట్లు స‌ర్ధుబాటు చేస్తారేమో చూడాలి.