Begin typing your search above and press return to search.

టెంపర్ చేయలేదు.. ఇజం చేస్తాడా?

By:  Tupaki Desk   |   26 Oct 2016 7:30 PM GMT
టెంపర్ చేయలేదు.. ఇజం చేస్తాడా?
X
తెలుగులో ఏదన్నా సినిమా హిట్టయ్యిదంటే చాలు.. వెంటనే దాని రీమేక్ గురించి తెగ రూమర్లు వచ్చేస్తున్నాయి. మొన్నామధ్యన సల్మాన్ ఖాన్ స్వయంగా పెళ్ళిచూపులు సినిమాను రీమేక్ చేస్తున్నాడు అని రావడమే పిచ్చి పీక్స్ అని చెప్పాలి. అసలు సల్మాన్ ఆ సినిమాను రీమేక్ ఎలా చేస్తాడో ఎవ్వరికీ అర్దంకాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ''ఇజం'' గురించి కూడా అలాంటి రూమర్లే వస్తున్నాయి.

అసలు పడిపోతున్న సల్మాన్ కెరియర్ నిలబడిందే.. పోకిరి సినిమాను రీమేక్ చేసిన తరువాత. అయితే అప్పట్లో వరుసగా సౌత్ సినిమాలు కొన్ని రీమేక్ చేశాడు కాని.. తరువాత మాత్రం మనోడు ఏక్ తా టైగర్.. భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ వంటి ఒరిజినల్ కంటెంట్ తో దూసుకుపోతున్నాడు. రీమేకులపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం పూరి జగన్ తీసిన ''ఇజం'' సినిమాను సల్మాన్ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు అంటూ వార్తలొస్తున్నాయి. అసలు నిజానికి టెంపర్ వంటి సినిమానే రీమేక్ చేయలేదు.. ఇజం చేస్తాడా?

ఇజం అండ్ టెంపర్ రెండింటిలో ఏది బెస్ట్ సినిమా అంటే మాత్రం.. ఖచ్చితంగా మనం 'టెంపర్' పేరు చెబుతాం. ఆ సినిమాలో అంత ఇంటెన్సిటీ ఉంది మరి. 'ఇజం' సినిమాలో ఆ ఒక్క కోర్టు సీన్ తప్పిస్తే.. ఇతరత్రా పెద్దగా కిక్కేం లేదు. అలాంటప్పుడు ఈ సినిమాను సల్మాన్ రీమేక్ చేస్తున్నాడనే ఊహే నవ్వులు తెప్పించేస్తోంది. డీ బాబూ అంటూ ఫిలిం నగర్లో జనాలు ఇతడిని తిట్టిపోస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/