Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: కండల వీరుడు కేక పుట్టించాడు

By:  Tupaki Desk   |   9 Oct 2015 2:29 PM GMT
ఫస్ట్ లుక్: కండల వీరుడు కేక పుట్టించాడు
X
మొన్నే ‘భజరంగి భాయిజాన్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి జోరుమీదున్నాడు సల్మాన్ ఖాన్. ఈ మధ్య ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫస్ట్ లుక్, ట్రైలర్లలో అభిమానుల్ని మెస్మరైజ్ చేశాడు. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా హిట్టవడం ఖాయం అన్న ఫీలింగ్ కలిగించేసింది ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. ఇప్పుడిక మరో హార్డ్ హిట్టింగ్ పోస్టరుతో జనాల ముందుకొచ్చాడు కండల వీరుడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుల్తాన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశాడు సల్మాన్. అది చూడగానే ఒక్కటే మాట.. సింప్లీ సూపర్బ్.

‘సుల్తాన్’ ఓ రెజ్లర్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ పతాకంపై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో సల్మాన్ తల్లిగా అలనాటి అందాల తార రేఖ నటిస్తుండటం విశేషం. 2016 రంజాన్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఇందులో సల్మాన్ కు హీరోయిన్ కూడా లేదని.. ఇదో రియలిస్టిక్ రెజ్లింగ్ ఫిల్మ్ అని చెబుతున్నారు. ఐతే మరోవైపు అమీర్ ఖాన్ సైతం రెజ్లింగ్ నేపథ్యంలోనే ఓ సినిమా చేస్తుంటం విశేషం. పొగట్ అనే రెజ్లర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘దంగల్’ కోసం అవతారం కూడా చాలా మార్చుకున్నాడు అమీర్. మరి ఒకే ఏడాది రాబోతున్న ఇద్దరు ఖాన్ ల రెజ్లింగ్ సినిమాల్లో ఏది ఎలా జనాల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.