మలైకాతో ఎఫైర్.. లెంపలేసుకుంటున్నాడట

Sun Apr 15 2018 12:00:35 GMT+0530 (IST)

సల్మాన్ ఖాన్ అన్న అర్బాజ్ ఖాన్ నుంచి అతడి భార్య మలైకా అరోరా విడిపోయిన కొన్ని రోజులకే యువ కథానాయకుడు అర్జున్ కపూర్ తో ఎఫైర్ వార్తలు బయటికొచ్చాయి. అర్జున్ తో ఎఫైర్ వల్లే అర్బాజ్ నుంచి మలైకా విడిపోయిందన్న ఊహాగానాలు బాలీవుడ్ మీడియాలో వచ్చాయి. అర్బాజ్ కు దూరమయ్యాక మలైకా అర్జున్ కు బాగా దగ్గరైందని.. వీళ్లిద్దరినీ సల్మాన్ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడని.. అర్జున్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అర్జున్ ను సల్మాన్ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని.. అతడితో కలిసి నటించొద్దని బాలీవుడ్ తన సన్నిహితులందరికీ ఆదేశాలు జారీ చేశాడని కూడా గుసగుసలు వినిపించాయి.ఐతే సల్మాన్ తో పెట్టుకుంటే మున్ముందు చాలా ఇబ్బందులుంటాయన్న భయంతో అర్జున్ ఈ మధ్య మలైకాకు దూరంగా ఉంటున్నాడట. అంతే కాక సల్మాన్ తో రాజీ కోసం అతను ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల సల్మాన్ కృష్ణ జింకల కేసులో జైలుకు వెళ్లినపుడు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాధ పడ్డాడట. సల్మాన్ ఇద్దరు చెల్లెళ్లతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న అర్జున్ తనపై అతడికున్న కోపాన్ని పోగొట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో తన తండ్రి బోనీ కపూర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు సల్మాన్ ఖాన్ పారితోషకం తీసుకోకుండా ‘నో ఎంట్రీ’ సినిమాలో నటించడాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మలైకాతో ఎఫైర్ విషయంలో లెంపలేసుకుని అర్జున్ సల్మాన్ తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక ఆంగ్ల పత్రిక కథనం ఇచ్చింది.