Begin typing your search above and press return to search.

నా పని చేసుకోనా.. మీమ్స్ చూస్తూ కూర్చోనా?

By:  Tupaki Desk   |   22 May 2019 6:09 AM GMT
నా పని చేసుకోనా.. మీమ్స్ చూస్తూ కూర్చోనా?
X
ఈమధ్య ఎగ్జిట్ పోల్స్ వింతలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. వాటిలో ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన ఒక వివాదాస్పద మీమ్ కూడా ఉంది. సదరు వివాదాస్పద మీమ్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివేక్ ఒబెరాయ్ షేర్ చేయడంతో రచ్చ మొదలైంది. ఐశ్వర్య రాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్ వివేక్ అనే సంగతి తెలిసిందే కదా.. దీంతో వివాదం మరీ ముదిరింది. పలువురు సెలబ్రిటీలు వివేక్ ను తప్పుబట్టారు. సోనమ్ కపూర్.. మథుర్ భండార్కర్.. ఈషా గుప్తా.. అనుపమ్ ఖేర్ తదితరులు వివేక్ చేసిన పనిని విమర్శించారు.

మొదట్లో తన తప్పేమీ లేదని సమర్థించుకోవాలని ప్రయత్నించినా.. హీట్ ఎక్కువవుతూ ఉండడంతో చేసేది లేక క్షమాపణ చెప్పి ఆ వివాదాస్పద ట్వీట్ ను డిలీట్ చేశాడు. అయితే ఈ మీమ్ పై మరో వ్యక్తి మాత్రం అసలు స్పందించలేదు. అయనెవరంటే సల్మాన్ ఖాన్. ఈ మీమ్ టార్గెట్.. ఐశ్వర్య రిలేషన్ షిప్స్. సల్మాన్ ఫోటో కూడా మీమ్ లో ఉంది. ఇదే విషయాన్ని రిపోర్టర్స్ సల్మాన్ దృష్టికి తీసుకెళ్ళి మీ స్పందన ఏంటని అడిగారు. "నేను వాటిపై దృష్టి పెట్టడంలేదు. గతంలో మాదిరిగా నేను ట్వీట్స్ చేయడం లేదు. ఇక మీమ్స్ ఏం చూస్తాను. నేను నా పని చేసుకోనా.. లేక కామెంట్స్ చూడనా. నేను అసలు పట్టించుకోవడం లేదు" అంటూ సమాధానం ఇచ్చాడు.

సల్మాన్ కనుక ఏమాత్రం తేడాగా మాట్లాడినా అది మరో వివాదంగా మారి ఉండేది. కానీ ఇప్పుడు నాకు మీమ్స్ చెక్ చేసేంత తీరికా లేదు.. ఓపిక అంతకన్నా లేదు అనే టైపులో సమాధానం ఇవ్వడంతో అందరూ నోరు మూసుకున్నారు. సల్మాన్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడని సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.