Begin typing your search above and press return to search.

అవెంజర్స్ కంటే రేసులో రేస్ 3 నే ముందు

By:  Tupaki Desk   |   25 Jun 2018 1:32 PM GMT
అవెంజర్స్ కంటే రేసులో రేస్ 3 నే ముందు
X
టైగర్ జిందా హై సినిమాతో హిట్ కొట్టిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈమధ్యనే రేస్ 3 సినిమాతో మరొక హిట్ నమోదు చేసుకున్నాడు. సినిమా ఇండియాలోనే కాక అటు పాకిస్థాన్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అదే వారంలో విడుదల అయిన పాకిస్తాన్ సినిమాలకంటే రేస్ 3 ముందుండడం విశేషం.

ఓపెనింగ్ రోజున 2.25 కోట్లు సంపాదించింది రేస్ 3 సినిమా. నిజానికి ఇక్కడ ముందే విడుదల అయినా - రేమో డిసౌజ దర్శకత్వం వహించిన రేస్ 3 సినిమా పాకిస్థాన్ లో ఒక వారం ఆలస్యంగా విడుదల అయింది. భారత్ లో ఈద్ సందర్భంగా విడుదల అయిన రేస్ 3 అక్కడ తరువాత వారంలో తెరకెక్కింది. ఈలోపు ఈద్ పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ నాలుగు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లో రెండు పెద్ద కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి ఇదిలా ఉండగా జవేద్ షేక్ అనే స్టార్ హీరో సినిమా ఒక వారంలో 2.55 కోట్లు గడించగా - మహిరా ఖాన్ నటించిన '7 దిన్ మోహోబ్బాత్ కే' సినిమా వారంలో 8.65 కోట్లతో బాగానే నడుస్తోంది.

మహిర ఖాన్ షారుక్ ఖాన్ తో రాయిస్ సినిమాలో నటించి మనకు కూడా పరిచయమయ్యింది. ఆమె సినిమా ఓపెనింగ్ రోజున 1.5 కోట్లు మార్కును దాటింది. మన సలు భాయ్ రేస్ 3 ప్రీమియర్లతో ఏకంగా 2.62 కోట్లతో రికార్డు సృష్టించేసింది. స్క్రీన్ లు తగ్గినా కూడా, కలెక్షన్స్ పరంగా అవేంజర్స్ సినిమాకంటే రేస్ 3 ముందుందట.